ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కాటారం సర్కిల్, మరియు డిఎస్పి కార్యాలయాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఇరు కార్యాలయాల్లో పెండింగ్ కేసులను, క్రైమ్ రికార్డ్స్ లను కేసు డైరీలు మరియు రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసు నమోదు మొదలు, కోర్టు డిస్పోజెన్ వరకు, గ్రేవ్ కేసుల నమోదు, దర్యాప్తు తీరుపై సీఐ రంజిత్ రావు, డిఎస్పీ రామ్ మోహన్ రెడ్డి లను అడిగారు. కేసులలో వృత్తి నైపుణ్యత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను అరెస్టు చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భద్రతా చర్యలను తీసుకోవాలని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులు ఉండాలని ఎస్పి ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ, పోక్సో కేసులలో నేరస్తులకు, నిందితులకు శిక్షలు పడేవిధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజులలో పరిశోధన పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. సర్కిల్, సబ్ డివిజన్ పరిధిలో జరిగే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలపైన కఠినంగా వ్యవహరించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, సిఐ రంజిత్ రావు, మహాదేవ పూర్ సీఐ కిరణ్, కాటారం, కొయ్యూరు, అడవి ముత్తారం ఎస్సైలు, శ్రీనివాస్, నరేష్, రమేష్ లు ఉన్నారు.


Post A Comment: