ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

మనఊరు-మనబడి పథకంలో భాగంగా చేపట్టిన పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని,  జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు  కలెక్టర్ సంధ్యా  రాణి తో కలసి మన ఊరు-మన బడి’ పథకం కింద  కేటాయించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో, ఎస్‌ఎంసీ చైర్మన్లు, ఎంఈవో, ఎంపీడీవో, ఏపీవో, ఇంజనీరింగ్‌ విభాగం ఏఈ, డీఈలు, సమీక్షా  సమావేశం నిర్వహించారు.ఈ  సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’ పనులను  ప్రతి పాఠశాలలో జరుగుతున్న పనులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పర్యవేక్షించి వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. మండలానికి 2  స్కూల్స్ చొప్పున  ఎంపిక  చేసిన 28 పాఠశాల లో   పనులన్నిoటిని  సత్వారమే పూర్తి చేసి పెయింటింగ్ చేయడానికి సిద్దం చేయాలనీ ఆదేశించారు. , 30 లక్షల కంటే ఎక్కువ అంచనా వేయబడిన 42 పాఠశాలల్లో ఇప్పటి వరకు 22 పాఠశాలల టెండర్ల ప్రక్రియ పూర్తి  అయి పనులు ప్రారంభం అవుతున్నాయని అన్నారు. మిగతా 20 పాటశాలలకు కూడా త్వరిత గతిన టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యె విధంగా చర్యలు తీసులోవాలని అన్నారు. చిన్నచిన్న అడ్డంకులు ఎదురైనా అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు. పాఠశాలల పనులు పూర్తిచేసేలా స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈజీఎస్  కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, ప్రహరీ, అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేసి, పెయింటింగ్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత నోడల్ ఆఫీసర్స్ ని వారానికి రెండుసార్లు పాఠశాలల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించాలన్నారు. పెండింగ్ బిల్లులను  సత్వరమే క్లియర్ చేయాల్సిందిగా డిఈఓ  ను ఆదేశించారు.

ఈ  కార్యక్రమం లో డిఆర్ఓ  వాసు చంద్రా,డిఆర్డిఏ  పిడి  శ్రీనివాస్ కుమార్, డిఈఓ  అహ్మద్ హై,డిఎం డబ్య్లు  శ్రీనివాస్, జిఎం  డిఐసి హరి ప్రసాద్,జడ్పీ  సిఈఓ  వెంకటేశ్వర్ రావు,డిసిఓ నాగేశ్వర్ రావు,ఈడి  ఎస్సీ  కార్పొరేషన్ మాదవి లత,ఈఈ నరేందర్ రెడ్డి, సిపిఓ సత్య నారాయణ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్లు, విద్యా శాఖ  అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: