మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మేడిపల్లి ఓసిపి 4 పరిసర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మరియు పర్యావరణ పరిరక్షణ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన పర్యావరణ ఉల్లంఘన కేటగిరి ప్రజాభిప్రాయ సేకరణలో హాజరైన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ పచ్చని పొలాలతో కలకలలాడే పల్లెలను ఓసిపి పేరుతో బొందల గడ్డగా చేయడమే కాకుండా భూములు త్యాగం చేసిన భూ నిర్వాసితులను ఆదుకోవడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా వి
ఫలమైందని అందులో మరీ ముఖ్యంగా దళితవాడలను గతంలో ఎన్నోసార్లు హామీలు ఇచ్చి రాతపూర్వకంగా హామీలు ఇచ్చి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ మరియు పురావస ప్రాంతాలకు తరలించి ఆదుకుంటామని ఇచ్చినహామీలు వట్టి నీటి మూటలు అయ్యాయని ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం భూ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ప్రజా పోరాటాలకు ఉద్యమాలకు వెనకాడేది లేదని ప్రభుత్వాన్ని మరి యు సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు అనంతరం భూ నిర్వాసితులతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ అధికారుల ముందు నిరసన వ్యక్తం చేసి పెద్దపెట్టున నినాదాలు చేసి గట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు..

Post A Comment: