మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మేడిపల్లి ఓపెన్ కాస్ట్ లో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో లింగాపూర్ ఎస్సి కాలిని కి ఇస్తా అని వ్రాత పూర్వక హామీ ఇచ్చి మోసం చేస్తూ కాలయాపన చేస్తూ న్నారని ఎస్సి కాలిని కి ఆర్.అండ్ ఆర్ ప్యాకేజీ వెంటనే అమలు చేసి కాలినిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని లేకుంటే తీవ్ర ఆందోళన చేస్తామని సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు అలాగే ప్రభావిత గ్రామం లింగాపూర్ లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కనీసం మంచినీటి సౌకర్యం కల్పించడంలో(మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టలేదని) విఫలమయ్యారని అధికారులను నిలదీశారు.సమస్య ను పక్క త్రోవ పట్టించి దాటవేసే ప్రయత్నం చేసినా ఉప కలెక్టర్ పర్యావరణ అధికారులు మరియు సింగరేణి జి.ఎం ముందు ధర్నా నిర్వహించారు ధర్నా నిర్వహించిన నాయకులను పోలీసులు అక్కడినుండి పంపి వేశారుఈ కార్యక్రమంలో నిమ్మరాజుల రవి తో పాటు బీజేపీ,కాంగ్రెస్,టీఆరెస్ నాయకులు, అధిక సంఖ్యలో లింగాపూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

Post A Comment: