ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ముఖాముఖి కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ తెలిపారు. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను విని పరిష్కరించేందుకు గత కొన్నిరోజులుగా ముఖాముఖి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. నేడు కాజిపేటలోని కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్లు, అన్ని విభాగాల అధికారులతో కలిసి 47,48,61,62,63 డివిజన్ల ప్రజలతో ముఖాముఖిని నిర్వహించి వారి నుండి 35 ఫిర్యాదులను స్వీకరించి ఆయా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని చీఫ్ విప్ అధికారులను ఆదేశించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరానికి ముఖ ద్వారమైమ కాజిపేట్ ప్రాంత అభివృద్ధికి నిరంతరం తాను నిరంతరం కృషి చేస్తునన్నారు. అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ కాబట్టి పలు దశలుగా ఈ ప్రాంత అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతం విద్య, ఆధ్యాత్మిక, వ్యాపార కేంద్రంగా వర్ధిల్లుతుందన్నారు. అన్ని మతాల ప్రజలు భాయ్ భాయ్ సిద్ధాంతంతో స్నేహ పూర్వకంగా మెలగడం కాజిపేట్ ప్రత్యేకత అని అన్నారు. గత కొన్ని రోజులుగా జాతీయ రహదారిపై కొంతమంది కూరగాయలు అమ్మడం వలన ట్రాఫిక్ జామ్,ప్రమాదాలు జరుగుతుండడమే కాకుండా కూరగాయల మార్కెట్ వ్యాపారులు తమకు నష్టం జరుగుతుందని గతంలో చీఫ్ విప్ కు తమ ఫిర్యాదును అందియ్యడంతో నేడు ముఖాముఖి కార్యక్రమంలో ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అట్లాగే ప్రజల నుండి మున్సిపల్ సంబంధిత, విద్యుత్,రోడ్లు, ఆరోగ్యపర, ఫించన్లు, మిషన్ భగీరథ, స్మశాన వాటికలు ఇలా పలు సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం విజయ్ నగర్ కాలనీ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి 10లక్షల నిధులతో శంఖుస్థాపన చేశారు. అధికారులతో కలిసి ఎ ఆర్ నగర్ కాలనీ,విష్ణుపురి కాలనీ,సోమిడిలోని పలు కాలనీలను కలియ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఏమైనా సమస్యలుంటే అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులను పరిష్కారం చూపాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్,కార్పొరేటర్లు సంకు నర్సింగ్,ఎలకంటి రాములు,విజయ శ్రీ రాజలి, మాజీ కార్పొరేటర్ అబూ బకర్, రైతు సమన్వయ జిల్లా కోఆర్డినటర్ సుంచు కృష్ణ తెరాస నాయకులు సుంచు అశోక్ మరియు డివిజన్ అధ్యక్షులు రంజిత్, కోటిలింగం, పాలడుగుల శివ మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: