మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మున్నూరు కాపు ముద్దుబిడ్డ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటిపై కొంతమంది గుండాలు దాడి చేయడం చాలా శోచనీయం ప్రజాస్వామ్యంలో సవాళ్లకు ప్రతి సవాళ్లు ఉండాలి కానీ ఇలా పొలిటికల్ ఫ్యాక్షనిజాన్ని ఎవరు సమర్ధించిన అది అనారోగ్యకరమైన వాతావరణాన్ని కలగజేస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రజలు గమనించి ఇలాంటి సంఘటన ఎవరు చేసిన ముక్తకంఠంతో ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది అలాగే ఒక బీసీ సామాజిక పార్లమెంటు సభ్యులు గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇంటి పై దాడి చేయడమే కాక ఇంట్లో ఉన్న తల్లిని భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తులను దూషించడం అమానుషం మరి ఒక సామాన్యుడు ఈ రాష్ట్రంలో ఏమి చేయలేడని దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం కావున సామాన్య ప్రజలారా దీనిని ప్రజాస్వామ్య పైజరిగినదాడిగాపరిగణించాల్సిన అవసరం ఉంది ఈ రకంగా మున్నూరు కాపులను రాజకీయంగా అణగ తొక్కాలని ఎవరు ప్రయత్నం చేసిన అది చివరకు దీనికి వచ్చే ఎన్నికలలో చక్కని రియాక్షన్ చవిచూడక మానరు ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో జరగడం చాలా దురదృష్టకరం
దీనిని యావత్ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ముక్తకంఠంతో ఖండించాలి. ఇకముందు ఇలాంటి దాడులు జరిగితే మున్నూరు కాపులు సహించేది లేదని తెలియపరుస్తు మున్నూరు కాపులు ఎక్కడ ఉన్న విలువలతో ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు .కానీ ఇలాంటి అధోగతి కుళ్ళు కుతంత్రపు చేష్టలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయరు.
ఇప్పటికైనా పోలీసులు దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి నిష్పక్షపాతంగా నిజాయితీగావ్యవహరించాలని తెలియజేస్తున్నాం..

Post A Comment: