మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

నిన్నటి  రోజున Trs  గుండాలు  నిజాంబాద్ బిజెపి పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఇంటి పైన దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మున్నూరు కాపు  సభ్యులుగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా గాజు భాస్కర్ మాట్లాడుతూ  ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఎలక్షన్లో పోటీ చేసి గెలిచే హక్కు ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య కల్పించింది మీకు ప్రజల ఓట్లతో గెలువ చేతకాక మిమ్ములను చిత్తుగా ఓడించినటువంటి మా యొక్క ధర్మపురి అరవింద్ అన్న పై వ్యక్తిగత కక్షలు కట్టి కులాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు రౌడీయిజం చేస్తున్నారు ఇది ఏ మాత్రం సరి అయింది కాదు ఒక మహిళ నాయకురాలిగా ఎదిగిన కల్వకుంట్ల కవిత కనీసం అరవింద్ అన్న ఇంటిలో మహిళలు ఉన్నారు అని కూడా గ్రహించకుండా సభ్య సమాజం తలదించుకునేలా ఒక మహిళ నాయకురాలు మహిళలపై దాడి చేయించడం శోచనీయం ఇప్పటికైనా  తక్షణ మే  కవిత గారు ధర్మపురి అరవింద్ అన్న గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం  లేదంటే రాబోయే రోజుల్లో మున్నూరు కాపు సభ్యులుగా మరియు బిజెపి కార్యకర్తలుగా మీకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో  బిజేపి మున్నూరు కాపు  నాయకులు బండారి లక్ష్మణ్, కస్తూరి రాజన్న, ఆకుల శ్రీనివాస్, స్తంభంకాటి శ్యామ్, అయ్యోరి సత్యనారాయణ, సంఘీ  మాధవ్, కసెట్టి  రాజేష్ బండారి గణేష్, బండారి సత్యనారాయణ ,సంఘీ రాజేష్ అప్ప మల్లేష్ , అసెట్టి  సత్య, తోట సిద్దు, కాశెట్టి శివ సాయి ,కాసెట్టీ హరీష్, నర్సయ్య  ,తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: