ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా శనివారం రోజున డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలో గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం 1994 మరియు బాలల హక్కులు చట్టాలపై డీఎంహెచ్వో డాక్టర్ బి సాంబశివరావు అధ్యర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన అనిల్ చందర్ రావు
మాట్లాడుతూ వైద్య రంగంలో వచ్చిన ఆధునాతన మార్పులతో గర్భస్థ శిశువు ఆరోగ్యస్థితితో పాటు లింగనిర్ధారణ సైతం కొందరు గుర్తిస్తున్నారని, లింగ నిర్ధారణలో ఆడపిల్ల అని తెలియగానే గర్భాన్ని తొలగించడం బాధాకరమని అన్నారు. ఈ చర్యలను నిరోధించడానికి ప్రభుత్వం చట్టం సైతం చేసిందని, అయినప్పుటికీ కొందరు చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని, అటువంటి వారిపై మరియు నిర్ధారణ కేంద్రాలపై నిఘా పెంచాలని,చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
డీఎంఅండ్ హెచ్వో డాక్టర్ బి సాంబశివరావు మాట్లాడుతూ ఆడపిల్లలపై వివక్షను రూపుమాపడానికి కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలని, ఆడ పిల్లలు మగ పిల్లలతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారనే విషయాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. క్షేత్ర స్థాయి ఆరోగ్య సిబ్బంది, శిశు సంక్షేమ శాఖ,గ్రామ పరిరక్షణ కమిటీ లు అవగాహనతో పాటు అబార్షన్ లకు ప్రయత్నిoచే వారి గురించి, చేసే వారి గురించి 104,1098, డయల్ 100 కి తెలియ చేయాలని సమాచారం అందించిన వారికి రూ. 2000/- పారితోషికం ఇవ్వబడుతుందన్నారు.
బాల్ రక్షా భవన్ కో ఆర్డినేటర్ కే శిరీష మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం పై అవగాహన కలిగి ఉండాలని, ఆడ పిల్లలపై జరిగే వివక్షను రూపు మపాలని అన్నారు.పిల్లలను పోషించలేని తల్లిదండ్రులు వారిని శిక గృహకు అప్పగిస్తే చట్టపరిధిలో వాటిని చట్ట బద్దమైన దత్తతకు ఇస్తామని వివరించారు. డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ యాకూబ్ పాషా మాట్లాడుతూ ఆడపిల్లలపై వివక్షనుతొలగించడానికి ప్రభుత్వం బేబీ బచావో- బేటీ పడావో అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. వారిని కక్షించి ఉన్నతికి కృషి చేయాలని కోరారు. సదస్సులో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ యాకూబ్ పాషా, డీఐవో డాక్టర్ గీతా లక్ష్మి,జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, చైల్డ్ లైన్ నోడల్ కో ఆర్డినేటర్ ఎండి ఇక్బాల్ పాషా, కో ఆర్డినేటర్ రాగి కృష్ణ మూర్తి, సూపర్ వైజర్లు, ఏఎన్ఎం లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: