ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
చారిత్రక నగరంలో బాల బాలికలపై ఎలాంటి అమానవీయ సంఘటనలు జరుగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు.
బాలల హక్కుల వలరోత్సవాలలో వారోత్సవాలలో భాగంగా శనివారం రోజున ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో ఊయల కార్యక్రమం మహిళా శిశు దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ అనుబంధ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రత్యేక దత్తత విభాగం ఆధ్వర్యంలో వదిలివేయబడిన పిల్లల రక్షణ సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఊయల కార్యక్రమం ప్రారంభించి అనంతరం ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ
పిల్లలను వదిలివేయబడగా నిరాదరణకు గురైన పిల్లల రక్షణ సంరక్షణ కోసం ఊయల కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో ఊయల ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. పిల్లలు వద్దనుకొనేవారు ఊయలలో వేయాలని, ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను చెత్త కుప్పల్లో కానీ,ముళ్ళ పొదల్లో వేసి అమానవీయ చర్యలకు పాల్పడవద్దని, ఒక అన్నగా తమ్ముడిగా కొడుకుగా తల్లీ తండ్రులను ఆర్జిస్తున్నాను పిల్లను వద్దనుకుంటే ఊయలలో కానీ నేరుగా గానీ దత్తత విభాగం అధికారులను సంప్రదించాలని సూచించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం నిరాదరణకు గురైన పిల్లలను చేరదీస్తుందని తెలిపారు. ఊయల కార్యక్రమం గురించి ప్రజలకు అవగహన కల్పించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు మాట్లాడుతూ వదిలి వేయబడిన పిల్లలను చేరదీసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశ పెట్టగా సదరు సమాచారం గురించి పత్రికలో ప్రకటన ఇచ్చి గడువు తీరిన తదుపరి లీగల్లి ఫ్రీ ఫర్ ఆడాప్షన్ చేసి వారిని చట్ట బద్ద దత్తత ప్రక్రియను కొనసాగిస్తున్నామని వీటిలో అమెరికా, మాల్టా, అమెరికా దేశాలకు ఇంటర్ కంట్రీ ఆడాప్షన్ ఇచ్చామని అన్నారు.
ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ మాట్లాడుతూ వదిలేసిన పిల్లలని చేరదీసి2007 సంవత్సరం నుండి అక్టోబర్ వరకు దత్తత వనరుల కేంద్రం నిబంధనల మేరకు 179 మంది పిల్లలను దత్తత ఇచ్చామని చెప్పారు. వదిలి వేయబడిన పిల్లల గురించి 100.1098 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. బీఆర్బీ కో ఆర్డినేటర్ కే శిరీష మాట్లాడుతూ బాలల రక్షణ ధ్యేయంగా లైన్ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో పని చేసి బాలల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని, భవిశ్యత్ కార్యక్రమ ప్రణాళికతో మరిన్ని సేవలు అందేలా కృషి చేస్తామని అన్నారు.
సంఘ సేవకురాలు కే అనితా రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు బాలల సంక్షేమమే లక్ష్యంగా పని చేసి బాలల స్నేహ పూర్వక జిల్లాగా మార్చాలని ఆకాంక్షించారు.
అనంతరం ఊయల కార్యక్రమానికి బాధ్యత తీసుకొని అందించిన దాత శేషగిరి రావు ను మరియు ప్రత్యేక శ్రద్ద తీసుకొని చర్యలు తీసుకున్న మెరుగు శ్రీనివాసులు, సంగి చైతన్య డూడం నగేష్ లను విప్ ఘనంగా సన్మానించి అభినందించారు.
కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సందసాని రాజేంద్ర ప్రసాద్, స్థానిక కార్పొరేటర్ భైరి లక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ యాకూబ్ పాషా, ఆసుపత్రి సూపరింటెండెన్ట్ డాక్టర్ విజయ లక్ష్మి, ఆర్ఎంవో డాక్టర్ సారంగం,
డెమో విఅశోక్ రెడ్డి,
ప్రొటెక్షన్ ఆఫీసర్
ఎస్ ప్రవీణ్ కుమార్,
ఎం మౌనిక,
ఎల్సిపివో సతీష్,
శిశుగృహ మేనేజర్ దూడం నగేష్, సోషల్ వర్కర్ శ్రీనివాసులు, సంగి చైతన్య.
జీ సునీత,కౌన్సిలర్
ఏ మాధవి, విజయ్ కుమార్,
ఐసిడిఎస్ సూపర్వైజర్లు వంచ రాజ్యలక్ష్మి, కవిత, చైల్డ్ లైన్ నోడల్ కో ఆర్డినేటర్ ఇక్బాల్ పాషా, కో ఆర్డినేటర్ రాగి కృష్ణ మూర్తి, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: