మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (SCRPS). పెద్దపెల్లి జిల్లా శాఖ  ఆధ్వర్యంలో  అంతర్గాం ఎమ్మార్వో కు మెమోరండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా *SCRPS పెద్దపెళ్లి జిల్లా అధ్యక్షులు భుషిపాక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని షెడ్యూల్ క్యాస్ట్ వారికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్సీలు క్రైస్తవ మతం స్వీకరించిన కూడా ఇంకా ఎస్సీ గా చలామన్ అవుతూ నిజమైనటువంటి హిందూ ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.కంచ చేను మేసినట్టు రాజ్యాంగ కల్పించిన హక్కులను రిజర్వేషన్లను అధికారులే తూట్లు పొడుస్తున్నారు. కాబట్టి వివిధ గ్రామాలలో ఎవరైనా ఎస్సీలు కుల ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటే వారి ఇంటికెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని,రాజకీయ నాయకులు మరియు రెవెన్యూ సిబ్బంది భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లపై పూర్తి అవగాహన తో పనిచేయాలని ఒక బాధ్యతగా రాజ్యాంగాన్ని రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కాపాడాలని కోరారు.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులకు ఎంతో మేలు చేసేదిగా ఉంది. అయితే ఈ దళిత బంధు పథకాన్ని నిజమైన హిందూ దళితులకు మాత్రమే అందేలా చేయాలి. కన్వర్టెడ్ క్రైస్తవులకు ఎస్.సి. హోదాలో దళితబంధును ఇవ్వడం సరికాదు. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవ్వదలచినా, వారికి BC-C సర్టిఫికెట్ మంజూరు చేసి ఆ కోటాలోనే దళితబంధు అందేలా చేయాలి; ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్-341(6) మరియు 1950(3) రాష్ట్రపతి (రాజ్యాంగ) ఉత్తర్వుల ప్రకారం SC లు క్రైస్తవం లేదా ఇస్లాం మతం స్వీకరిస్తే వారికి SC హోదా వర్తించదు. G.O.Ms.No.1793, Education dept., dated:23.09.1970 ప్రకారం మతం మారిన SCలు BC-Cలుగా పరిగణించబడతారు కాబట్టి మతం మారిన క్రైస్తవులకు దళితబంధు పథకాన్ని SC కోటాలో అమలు చేయొద్దని, అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి రాజ్యాంగబద్ధమైన నిజమైన హిందూ దళితులకు మాత్రమే దళితబంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాము. లేనియెడల డా॥బి.ఆర్. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మోసపుచ్చడమే అవుతుంది. అనిఅంతేకాక క్రైస్తవ మతం స్వీకరించిన వారికి లేదా వారి పిల్లలకు SC కుల హోదా వర్తించదు కాబట్టి అలాంటి వారికి ఎస్.సి. కులం సర్టిఫికెట్ మంజూరు చేయడం రాజ్యాంగ విరుద్ధం, క్షేత్రస్థాయిలో సరైన విచారణ జరపకుండా సర్టిఫికెట్స్ జారీ చేయడం కూడా చట్టప్రకారం నేరమే అవుతుంది. కావున మతం మారిన వారికి బి.సి.-సి సర్టిఫికెట్ మంజూరు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి డిమాండ్ చేసినారు .‌ఈ కార్యక్రమంలో *జిల్లా ఉపాధ్యక్షులు అసంపెళ్లి ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: