మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య తన భర్తను ఇటుకతో తలపై కొట్టి దారుణంగా హతమార్చిన సంఘటన..పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పెర్మనెంట్ టౌన్ షిప్ లోని సర్వెంట్ క్వార్టర్ లో చోటు చేసుకుంది...రామగుండం ఎల్కలపల్లి గేటు ప్రాంతానికి చెందిన చిలుముల సుమన్ ఐదేళ్ల క్రితం పొట్యాల గ్రామానికి చెందిన స్పందనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు...
అప్పటికే ఇద్దరికీ మొదటిసారిగా పెళ్లిళ్లు జరిగాయి.ఇద్దరికీ సంబంధించి రెండో పెళ్లి కావడంవల్ల తరచూ ఇంట్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి.
ఆటో నడుపుకుంటూ ఉండే సుమన్ తన భార్య స్పందన ఎన్టీపీసీ టౌన్ షిప్ ఉద్యోగుల నివాసాల్లో పనిచేస్తూ ఉండేది..
ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారు జామున భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగడంతో భర్త వేధింపులు భరించలేక..అక్కడే ఉన్న ఇటుకతో సుమన్ తలపై కొట్టగా సుమన్ అక్కడికక్కడే మృతి చెందాడు...సంఘటన స్థలాన్ని రామగుండము సర్కిల్ ఇన్స్పెక్టర్ కణతల లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ ఎస్ఐ జీవన్ పరిశీలించారు...
అనంతరం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు... నిందితురాలు స్పందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Post A Comment: