మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి గ్రామంలో ఆదివారం దళిత యువకుడి పై దాడి జరిగింది. గ్రామంలో మల్టిపుల్ కార్మికునిగా విధులు చేస్తూ యధావిధిగా రోజువారీ విధంగా ఉద్యగా రీత్యా గ్రామ పంచాయితీ కార్యాలయంలోని ఆవరణలో వ్యర్ధ పదార్ధాలు శుభ్రం చేస్తూ ఉండగా అదే గ్రామానికి చెందిన వైశ్యు కులం కు చెందిన వ్యాపారి భూతులు, తిడుతూ అకారణంగా దాడి చేసిన విషయం రామగుండం నియోజకవర్గ పరిధిలో దాడి విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే యువకుడు వ్యాపారి కిరాణా దుకాణం వద్దకు ఆహార పదార్థాల కోసం వెళ్లగా వ్యాపారి భార్య తన భర్త విషయమై ఆరాలు తీయగా ఇంటిలోనే ఉన్న సదరు వ్యాపారి విషయం గ్రహించి నా భార్యకు నా వ్యక్తిగత వివరాలు చెప్పుతావ అంటు యువకుడిని స్థానికంగా ఉన్న కంక్క కట్టే తో ఉదయం చితక భదాడు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రక్త స్రావం జరుగుతున్న యువకుడిని గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగుగైన వైద్యం అందించాలని రామగుండం సి. ఐ,వైద్య అధికారులతో సమీక్షించారు. యువకుడి గాయాలు అతనిపై జరిగిన దాడి మండలంలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. దీనితో దళిత సంఘాలు, *ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాబయ్య, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఉప్పులేటి పర్వతాలు నాయకులు ప్రతినిధులు, ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆవేదనలు, భార్య పసికందు ఏడుపులు గ్రామంలో గ్రామంలోని మహిళలు కన్నీటి పర్యాంతం అయ్యారూ ఆ దాడిపట్ల పోలీసు అధికారులు చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.. *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భూష్పక సంతోష్ మహారాజ్  మాట్లాడుతూ. రామగుండం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దళితులపై ఇంకా కూడా దాడుల కోనసాగుతున్నాయి అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని . లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం, విషయాన్ని డిజిపి దృష్టిన తీసుకెల్లి న్యాయం చేసే వరకు పోరాడతము  అని గ్రామంలో కులాల నిర్ములన వ్యవస్థ రోజురోజుకు నిరాశ నిస్పోహలతో నిండిపోయింది. అని న్యాయంకోసం ఎంతోమంది అతృతగా ఎదురుచూస్తున్నారుఅని బాధితుడు ఉప్పులేటి మధుకర్ కు న్యాయం జరిగేలా అధికారులు చూడాలని 

కులం ఆధారంగా విచక్షణంగా దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నామని  అన్నారు. .బాధితుడు ఉప్పులేటి

మధుకర్, మాట్లాడుతూ నాకు న్యాయం జరిగేలా అధికారులు చూడాలి అకారణంగా నాపై దాడి చేసిన వ్యక్తి పైచట్టపరమైన చర్యలు తీసుకోవాలని అతనికి శిక్ష పడేలా చేయాలని కోరుతున్నాం 

గోదావరిఖని ఏసీపీ బి. గిరిప్రసాద్  మాట్లాడుతూ సంయమనం పాటించాలి

చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం బాధిత కుటుంబాల సభ్యుయలు సహనం పాటించి ఎవరైతే దాడికి పాల్పడిన వ్యక్తి పై చర్యలు తీసుకుంటామని కొంచం సమయమం పాటించి పోలీసులకు సకరించాలని కోరరు.......

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: