మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
AICC కార్యదర్శిగా మరియు కర్ణాటక రాష్ట్ర ఇంచార్జ్ గ నియమితులై తొలిసారి గోదావరిఖనికి విచ్చేసిన సందర్భంగా *శ్రీధర్ బాబు , మరియు *ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రామగుండం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ *రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ నాయకత్వంలో రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా భారీ గజమాలతో సన్మానించారు. మరియు రాజ్ ఠాగూర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి మాజీ కార్పొరేటర్లు *చుక్కల శ్రీనివాస్ మరియు పాతపల్లి రవికుమార్ మంథని శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు *శ్రీధర్ బాబు మరియు *ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *రాజ్ ఠాకూర్ * కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొంతల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Post A Comment: