పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:అక్టోబర్:18:22:మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి
హర్షం వ్యక్తం చేసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్..జిల్లా అభివృద్ధికి రూ30.60 కోట్ల ప్రత్యేక నిధులు.పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.30.60 కోట్ల ప్రత్యేక నిధులను విడుదల చేసారు.ఈ మేరకు ప్రభుత్వం నుండి జీవో ఆర్టి నంబర్.294 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.ఇటివల ముఖ్యమంత్రి కేసిఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లాలోని 266 గ్రామ పంచాయతీ లకు,రామగుండం కార్పొరేషన్,మంథని,పెద్దపల్లి,సుల్తానాబాద్ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ వినతిపత్రం అందించి విజ్ఞప్తి చేయగా సభలో బహిరంగంగా నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసిఆర్ మాట నిలుపుకున్నారు.బహిరంగ సభలో అభివృద్ధి నిధుల కోసం విజ్ఞప్తి చేసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధును అభినందించిన ముఖ్యమంత్రి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల జడ్పీ చైర్మన్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే జిల్లా వ్యాప్తంగా 266 గ్రామ పంచాయతీలు,రామగుండం,మంథని,పెద్దపల్లి,సుల్తానాబాద్ పట్టణాలలోని సర్పంచులు,ఎంపీటీసీ లు,మేయర్,మున్సిపల్ చైర్ పర్సన్లు,కార్పొరేటర్ లు, మున్సిపల్ కౌన్సిలర్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Post A Comment: