పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
గోదావరిఖని:అక్టోబర్:21:22:రామగుండం కమిషనరేట్,పెద్దపల్లి జిల్లా,రామగుండం ఆర్ముడ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్,(ఐజీ)పెద్దపల్లి డిసిపి రూపేష్ ఐపిఎస్.పోలిస్ గౌరవందనం అనంతరం వివిధ సంఘటనలో ఉగ్రవాదులచే అసాంఘిక శక్తులచే పోరాడి అసువులు బాసిన అమరవీరుల పేర్లను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఈ సంవత్సరం అసువులు బాసిన 264 మంది పేర్లను పెద్దపల్లి డీసీపీ రూపేష్ ఐపిఎస్ చదివారు.అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛము ఉంచి నివాళులు అర్పించారు.అనంతరం డిసిపి మాట్లాడారు అక్టోబర్ 21-1959 సంవత్సరంలో 20 మంది జవాన్లు కలసి లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన వారిపై దాడి చేసి10 మందిని హతమార్చినది.అప్పటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్-21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అమరులైన పోలీసుల జీవితాలనే మార్గదర్శకంగా,ఆదర్శంగా మలుచుకుంటు ప్రజాసేవకు,ప్రజల ధన,మాన,ప్రాణాల రక్షణకు పునరాంకితం కావడం.ఉగ్రవాదం,తీవ్రవాదం,మతతత్వం వంటి విఛ్ఛిన్నకర శక్తులతో నేరాలకు,ఘోరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడవలసి రావడంతో పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాగ ఎంతో ప్రమాదకరంగా పరిణమించింది అన్నారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడారు పోలీస్ అమరవీరుల త్యాగలు మరువలేనివని,వారి త్యాగ ఫలితంగానే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారని దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు.ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే,అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారు.ధనవంతులు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికీ సాయం కోరేది పోలీసులనే,శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే,అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి,భద్రతకు భరోసా ఇచ్చేది,సామాజిక ఆస్తులను సంరక్షించేది,శాంతిభద్రతలను అదుపులో పెట్టడం,నేరగాళ్ళను నియంత్రించడం పోలీసు కర్తవ్యం.అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు.ఈ సంవత్సరంలో మన దేశంలో విధి నిర్వహణలో(264)మంది వీరమరణం పోందిన వారందరికీ మనము అందరము శ్రద్దాంజలి ఘటిస్తున్నాము.వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను సర్వస్వం లభింపచేయడం,అయా కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు.త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తాం అని అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం అని ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు.సంస్మరణ దినోత్సవం రోజున మృతి చెందిన పోలీసు కుటుంబాల సభ్యులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు.ఈ కార్యక్రమంలో డిసిపి సిహేచ్ రూపేష్ ఐపిఎస్.స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్,గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్,ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్,ఏసీపీ ఏఆర్ సుందర్ రావు,ఇన్స్పెక్టర్స్,సబ్ఇన్స్పెక్టర్స్,రిజర్వడ్ ఇన్స్పెక్టర్స్,రామగుండము పోలీస్ కమిషనరేట్ పోలీస్ సంఘం అద్యక్షులు బోర్లకుంట పోచలింగం,ఎఒ నాగమణి,సిసి శ్రవణ్ కుమార్,ఎఆర్,సివిల్ పోలీసు సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Post A Comment: