పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న.
పెద్దపల్లి,అక్టోబర్ -21:ప్రతి ఇంట్లో అయోడైజ్డ్ ఉప్పు వాడాలని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ తెలిపారు.శుక్రవారం ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినోత్సవమును పురస్కరించుకొని స్థానిక పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ,అవగాహన కార్యక్రమము నిర్వహించారు.ఈ సందర్భముగా డి.ఎం.అండ్ హెచ్.ఓ.మాట్లాడారు,అయొడైజ్డ్ ఉప్పు ఆరోగ్యమైన జీవితానికి నాంది,అని,ప్రతి ఇంట్లో అయొడైజ్డ్ ఉప్పు ఉండాలని,అయొడైజ్డ్ ఉప్పును వాడడం వలన మనకు రోజు కావాల్సిన 15 ఎంజి ల అయోడిన్ లభిస్తుందన్నారు.ఒకవేళ మన శరీరంలో అయోడిన్ ఎక్కువ చేరిన అది మూత్రము ద్వారా బయటకు వెళ్తుంది,పిల్లలకు,గర్భిణీలకు,పాలిచ్చే తల్లులకు,అందరికి అయోడిన్ రోజు అవసరం అని,ఇది మనం తీసుకొనే ఆహారం లో లభించినను,అది సరిపోకపోవచ్చు నని,అందుకే అయొడైజ్డ్ ఉప్పును వాడాలని,ఉప్పు డబ్బా యొక్క మూత గట్టిగా పెట్టి ఉంచడం వలన అయోడిన్ ఆవిరి కాకుండా ఉంటుందిని అన్నారు.ఎన్.సి.డి.ప్రోగ్రాం అధికారి డాక్టర్ పురుషోత్తం మాట్లాడుతూ,అయొడైజ్డ్ ఉప్పు వాడకం వలన మంచి శారీరక,మానసిక ఆరోగ్యం సరి అయిన పెరుగుదల,చురుకుదనం,ఉత్సహం,జ్ఞాపక శక్తి,సంగ్రహ శక్తి పెరగడం,సక్రమంగా గర్భస్థ శిశువు పెరుగుదల,చదువుల్లో వయస్సుకు తగ్గ ప్రతిభ ఉంటుంది అన్నారు.ఎన్.టి.ఈ.పి,ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ,అయొడైజ్డ్ ఉప్పు వాడక పోవడం వలన జరిగే నష్టాలను వివరించారు.అవి ముఖ్యంగా గర్భస్రావం జరగడం,మృత శిశువు జననం,గొంతు వాపు(గాయిటర్),అతి తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం,మరుగుజ్జుతనం,చెవిటి,మూగ,బుద్ది మాంద్యత లాంటివి ఉంటాయి అన్నారు.ఈ కార్యక్రమంలో పిఓడిటిటీ డాక్టర్ సంపత్,జిల్లా వైద్య సిబ్బంది రాజేశం,రాజేష్ ఎన్సిడి కోఆర్డినేటర్,టీబి కోఆర్డినేటర్ వీరగోని శ్రీనివాస్,పీహెచ్ఎన్ జ్యోతి,స్థానిక ఆరోగ్య సిబ్బంది,ఆశాలు,తదితరులు పాల్గొన్నారు,


Post A Comment: