ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
![]() |
హన్మకొండ ;
చిరుత పులి చర్మం కేసులో ఆరుగురు నిందుతులను అరెస్ట్ చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జే.సురేందర్ రెడ్డి తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో వన్య ప్రాణుల వేటను నిరోధించుటకు, వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడి, బలికాకుండా ఉండేవిధంగా అటవీ శాఖ సమన్వయంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు కాటారం డిఎస్పి రాం మోహన్ రెడ్డి పర్యవేక్షణలో మహాదేవపూర్ సి.ఐ,టి. కిరణ్ , మహదేవ్ పూర్ ఎస్సై ఎన్. రాజకుమార్ మరియు సిబ్బంది తో ప్రత్యేక టీం ని ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఆరుగురు నిందితులు చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పామేరు అటవీ ప్రాంతంలో లో ఒక చిరుత పులి ని చంపి, దాని చర్మం ఒలిచి మహారాష్ట్ర కు చిరుత పులి చర్మం ను ఎవరికైనా అమ్మడం కోసం తెలిసిన వారిని కలవడానికి మహాదేవపూర్ ప్రాంతం కి వస్తూన్నారనే నమ్మదగిన సమాచారంపై మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లో పోలీసులు, వారిని పట్టుకొని వారివద్ద గల బ్యాగ్ ని పరిశీలించి చూడగా ఒక ఎండ బెట్టిన చిరుత పులి చర్మం కలదు. వారిని వెంటనే అదుపులోకి తీసుకోని వారిని విచారించగా వారి పేర్లు
ఇరుప నాగేంద్ర బాబు@చంటి(28) , సుందరయ్య కాలనీ కొయ్యూరు గ్రామం చర్ల మండలం, కొత్తగూడెం జిల్లా,
పొలం వెంకటేష్, (30), రొయ్యూరు గ్రామం, ఏటూర్ నగరం మండలం, ములుగు జిల్లా, పరిసబోయిన రాజేష్, (28), శంకర రాజు పల్లి, మండలం ఏటూరు నాగారం, ములుగు జిల్లా,
ఎర్ర గట్ల శ్రీకాంత్(23), ఏడుజెర్ల గ్రామం, వాజేడు మండలం, ములుగు జిల్లా,
బుర్రి సాయికిరణ్ (25),
దాచారం గ్రామం, కుక్కునూరు మండలం, వెస్ట్ గోదావరి జిల్లా, ప్రస్తుతం సారపాక గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బొమ్మకంటి కిషోర్, (27), బెస్త గూడెం గ్రామం, కుక్కునూరు మండలం, వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వారమని తెలిపినారన్నారు. వారివద్ద నుండి చిరుత పులి చర్మం స్వాధీనం చేసుకొని వారిని మహాదేవపూర్ పోలీస్ అధికారులు విచారించగా వారు నేరం చేసిన విధానం మరియు వివరాలు తెలపడం జరిగింది .
వివరాల్లోకి వెళితే... గత కొద్ది రోజుల నుండి ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా హుసూరు తాలూకా పామేడ్ గ్రామ శివారులో గల అడవిలో చిరుతపులి తిరుగుచున్నదని, ప్రజలందరూ అనుకుంటుండగా అది గమనించి ఇద్దరు నేరస్థులు అట్టి చిరుత పులిని ఎలాగైనా చంపి దాని యొక్క చర్మము తీసి వన్యప్రాణుల చర్మం కొనే వారికి అమ్మినట్లయితే పెద్ద మొత్తంలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చు అని పథకం వేసుకున్నారు.
మహాదేవ్ పూర్ పోలీస్ దర్యాప్తు...
నిందితులు గత కొద్ది రోజులనుండి వ్యయసాయం, కూలి పనులు చేసుకుంటూ మరియు అడవి జంతువులను చంపి వాటిని ఇతరులకు అమ్ముకొని సులువుగా డబ్బులు సంపాదిస్తూ జీవిస్తున్నారు. గత కొద్ది రోజులనుండి చత్తీస్గడ్ రాష్ట్రం, పామేడ్ శివారు అడవిలో చిరుత పులి తిరుగుచున్నది తాము ఇద్దరం కలిసి ఎలాగైనా అట్టి చిరుత పులిని చంపి దాని యొక్క చర్మము తీసి ఇతరులకు ఎవరికైన అమ్మినట్లయితే పెద్ద మొత్తంలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చు అని అనుకొని నిందితులు ఇద్దరు నాగేంద్రబాబు, పోలం వెంకటేష్ లు కొద్ది రోజుల నుండి అట్టి పులి గురించి రాత్రి వేళలలో టార్చి లైట్లను పట్టుకొని, పామేరు శివారులో గల అడవిలో తిరుగుతూ అక్కడ చిరుత పులి తిరిగే ప్రదేశానికి వెళ్లి, చిరుతపులి తిరిగే ఆనవాలును గుర్తించినారు. అట్టి చిరుత పులిని వారు ఎలాగైనా చంపి దాని యొక్క చర్మము తీసి అమ్మాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న ప్రకారముగా అట్టి పులిని ఉచ్ఛు పెట్టి చంపి వాటి యొక్క చర్మము తీసుకుని అమ్ముట గురించి మహారాష్ట్ర కు బయలుదేరినారు. ఎక్కడైనా బయట వన్యప్రాణుల చర్మం కొనేవారికి అమ్మి ఎక్కువ డబ్బులు పొందాలనుకున్నారు.
పొలం వెంకటేష్, (30), శంకర్రాజుపల్లి, రొయ్యూరు గ్రామం, ఏటూరునాగారం మండలం, ములుగు జిల్లా నాకు తెలిసిన వ్యక్తి అగు ఇరుప నాగేంద్రబాబు సుందరయ్య కాలనీ, కొయ్యూర్ గ్రామం, చర్ల మండలం అను వ్యక్తి అనునతనితో నాకు పరిచయం ఏర్పడి అప్పటి నుండి మేము మంచి స్నేహితులుగా ఉంటున్నాము. నాగేంద్రబాబు అత్తగారి ఊరైన పామెడు గ్రామ శివారున, తాను అప్పుడప్పుడు క్రూర జంతువులను చంపి వాటి మాంసంను విక్రయిస్తుంటాడు. అదే క్రమంలో మేము ఇద్దరం కలిసి గత కొన్ని రోజుల క్రితం క్రూర జంతువుల కొరకు ఉచ్ఛుపెట్టగా, అట్టి ఉచ్చులో ఒక చిరుత పులి చనిపోయినది, దాని చర్మం వొలిచి దానిని అమ్మితే లక్షలల్లో డబ్బులు వస్తాయని, అలా వచ్చే డబ్బులను పంచుకుందామని అనుకుని. అదే విషయాన్ని మా గ్రామానికి చెందిన నా చిన్నప్పటి స్నేహితుడు అయిన పర్శబోయిన రాజేశ్, అనునతనికి తెలిపి మనం ఎలాగైనా అట్టి చిరుత పులి యొక్క చర్మమును రహస్యంగా ఎవరికైనా ఎక్కువ డబ్బులకు అమ్మి తద్వారా వచ్చే డబ్బులలో కొన్ని డబ్బులు ఇరుప నాగేంద్ర బాబు @చంటికి అప్పగించి మిగిలిన డబ్బులను మనమే పంచుకుందాం అని అనుకొనగా, అందుకు తను సరే అని ఒప్పుకున్నాడు. అలా అందుకు ఇంకా నమ్మకమైన వేరే వారి యొక్క సహకారం కావాలని మేము అనుకొనగా, అప్పుడు పర్శబోయిన రాజేశ్ నాతో తనకు తెలిసిన మా ప్రక్కన గ్రామానికి చెందిన ఎర్రగట్ల శ్రీకాంత్ అనునతను ఉన్నాడని అతను అయితే మనకు నమ్మకంగా ఉంటాడని తెలిపి, అతనికి ఫోన్ చేసి ఇట్టి విషయమును తెలుపగా అతను మా వద్దకు వచ్చి అట్టి చిరుత పులి యొక్క చర్మమును చూసి, మాకు సహకరించుటకు ఒప్పుకున్నాడు. అందుకు మేము దీనిని అమ్మడానికి ఇంకా మనకు వేరే వారి యొక్క సహకారం కూడా కావాలని చెప్పగా, ఎర్రగట్ల శ్రీకాంత్ మాతో తనకు తెలిసిన ఇద్దరు స్నేహితులు ఉన్నారని వారిది భద్రాద్రి కొత్తగూడెం అని తెలుపగా వారు మనకు తప్పకుండ సహకరిస్తారని తెలిపి, అలా గత పది రోజుల క్రితం ఎర్రగట్ల శ్రీకాంత్ అను వ్యక్తి తనకు తెలిసిన ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి అట్టి చిరుత పులి చర్మం గురించి తెలిపి దానిని అమ్మడానికి మీరు సహకరించాలని తెలుపగా వారు సరే అని ఒప్పుకున్నందున, అలా మేము ముందుగా అనుకున్న పథకం ప్రకారంగా ఈ నెల 21 న పర్శబోయిన రాజేశ్ తన యొక్క స్నేహితుడి యొక్క మోటార్ సైకిల్ తీసుకుని రాగా, దానిపైన మేము అట్టి చిరుత పులి యొక్క చర్మమును రహస్యంగా ఎవరికీ కనపడకుండా ఒక బ్యాగులో భద్రపరిచి మా వద్ద ఉంచుకుని మా గ్రామము నుండి మా ప్రక్కన గ్రామానికి చెందిన ఎర్రగట్ల శ్రీకాంత్ అను వ్యక్తి వద్దకు వెళ్ళి అతడిని కూడా మా యొక్క మోటార్ సైకిల్ పైన ఎక్కించుకుని అమ్మడం కొరకు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం గా అక్కడనుండి మేము వెళ్లి దాన్ని మహారాష్ట్రకు తీసుకువెళ్లి అక్కడ 30 లక్షల రూపాయలకు అమ్ముదామని బయలుదేరి వెళ్లి
మహాదేవ్ పూర్ శివారులోని ఒక అడవిలో ఆగి, మా వద్ద ఉన్న పులి చర్మమును మహారాష్ట్ర లో ఎవరికి ఎలా అమ్మాలి అని, అందుకు ఎవరము ఎలా పని చేయాలి అని అనుకుంటున్న సమయంలో 21 న అందాద ఉ,,07.00 గంటలకు పోలీసు వారు అనుమానంతో మా వద్దకు రాగా, మేము వారిని చూసి భయపడి అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేయగా, పోలీసు వారు మమ్ములను పట్టుకున్నారు. అలా అట్టి పులి చర్మము ఉన్న బ్యాగు మా వద్ద ఉండగా అనుమానంతో పోలీసు వారు దానిని తీసి చూపమని చెప్పగా అందులో మేము దాచిపెట్టిన చిరుత పులి యొక్క చర్మం కనబడింది అని తెలిపి, పంచుల సమక్షంలో చూపించగా అందులో చిరుత పులి యొక్క చర్మమును చూడగా దాని పైన గోధుమ రంగు మరియు నల్లని బొట్లు కలవు. తర్వాత పంచనామా నిర్వహించి చిరుతపులి చర్మం, రెండు మోటార్ సైకిల్ 5 సెల్ ఫోన్లు, మూడు వేల రూపాయల తో సహా ఆరుగురు వ్యక్తులను మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించినారు.
అటవీ సంరక్షణకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తీసుకున్న నివారణ చర్యలు
డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో అడవులను నరకకుండా అక్రమ రవాణా జరగాకుండా వన్యప్రాణులను వేటాడకుండా ఎల్లప్పుడూ పోలీస్ నిఘా ఉంచడమైనది.
అటవీ శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో అటవీ ప్రాంతాలలో అటవీ సంపదను రక్షించడానికి, వన్య ప్రాణులను కాపాడడానికి డ్రోన్ కెమెరాల సహయంతో రెక్కి నిర్వహిస్తున్నాము.
పోలీస్ శాఖ మరియు అటవీ శాఖ సమన్వయంతో
వన్యప్రాణులను వేటగాళ్ళ బారినుండి వేటకు బలికాకుండా అడ్డుకట్టు వేయడానికి ,అటవీ సంపదను సంరక్షించడానికి పోలిస్ శాఖ, మహాదేవపూర్ అటవి శాఖ అధికారుల సమన్వయంతో కలిసి పనిచేయడం జరుగుతుందని.
పోలీస్ శాఖ మరియు అటవీశాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని వారికదలికలు ఎప్పటికప్పుడు పసిగడుతూ దాడులు చేస్తాం అన్నారు.
గతంలో వన్యప్రాణుల వేట సంబంధిత కేసులలో ఉన్న వారిని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని వారి ప్రవర్తన మార్చుకొని సాదారణ జీవితం గడపాలనీ ఎస్పి సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.
వారి ప్రవర్తన మార్చుకోలేని పక్షంలో ఎంతటి వారైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని, వన్యప్రాణుల వేట మరియు అటవీ సంపద కొల్లగొట్టే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పి సురేందర్ రెడ్డి హెచ్చరించారు.
పర్యావరణ సమతుల్యం...
ఇటీవల పర్యావరణ సమతుల్యం దెబ్బ తినడంతో అలాగే, ఉన్న అడవులను కలప స్మగ్లర్లు విచక్షణ రహితంగా నరికి వేయడంతో పర్యావరణ సమతుల్యత బావి తరాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారును అందుచే అడవుల యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో వుంచుకొని అటవీ సంపదను మరియు వన్య ప్రాణులకు నష్టం కలిగించే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదునీ ఎస్పి అన్నారు. కలప స్మగ్లర్లపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారి చేయడం తో పాటు పోలీస్ శాఖకు కూడా ఈ యొక్క బాధ్యతను అప్పగించడం జరిగిందనీ, .ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ మరియు అటవీశాఖ సంయుక్తంగా అనేక సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు మానవ మనుగడకి ముంపు తేచ్చే కలప స్మగ్లింగ్ చేసేవారు, వన్యప్రాణులను చంపేవారు ఎంతటివారైన చట్ట పరంగా చర్యలు ఉంటాయని అన్నారు. అటవీ సంపద, వన్యప్రాణుల జోలికి వెళ్ళే వారిపై కఠిన చర్యలు నాన్ బెయిల బుల్ సెక్షన్లు తోపాటు పిడి యాక్ట్ అమలు చేయడం జరుగుతుందనీ, ఎస్పి అన్నారు.
చిరుత పులి చర్మంను స్వాధీనం చేసుకొని నిందితులను పట్టుకోవడం లో పాల్గొన్న మహాదేవపూర్ సిఐ. టి. కిరణ్, ఎస్సై. రాజ్ కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుల్ లు ధనుంజయ్, కిషన్, శ్యామ్, కిరణ్, అన్వేష్ అను వారిని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ ఎస్.సురెందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమం లో కాటారం డిఎస్పి రాంమోహన్ రెడ్డి , ఎఫ్డిఓ వజ్రారెడ్డి,ఎఫ్ ఆర్ ఓ కమల డిఆర్వో సాయి ప్రసాద్,
ఎఫ్ బిఓ మోన కౌసర్ పాల్గొన్నారు.


Post A Comment: