ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఆక్టోబర్ 21నుంచి 31 వరకు "పోలీస్ ఫ్లాగ్ డే" కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా, మరియు త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను, తెలిపే విధంగా ఉండే ఇటీవలి కాలంలో తీసీన తక్కువ విడిది( 3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్, ఫోటోలను, రాష్ట్ర స్ధాయి పోటీల కోసం, ఈనెల 24 వ తేది వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో
సంబంధిత షార్ట్ ఫిల్మ్ ను, 10x8 సైజ్ ఫోటోలను, పోలీసు పి.ఆర్.వో కు అందజేయాలని, మరిన్ని వివరాల కోసం 9440904167, 9396498805, నంబర్లను సంప్రదించాలని ఎస్పి జె. సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Post A Comment: