మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ బలహీనవర్గాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో బిసిలంతా సమావేశమయ్యారు. మునుగొడు ఉప ఎలక్షన్ లో ప్రధాన పార్టీలన్నీ బిసి లను మోసం చేసాయి 80% బిసిలు ఉంటే పార్టీలన్నీ ఒకే అగ్రవర్ణ సమజికవర్గ సోదరులకు ఇవ్వడం కరెక్ట్ కాదు అని తాత జెండా ఎత్తి తండ్రికి ఇచ్చాడు అదే జెండా తండ్రి కొడుకు ఈరకంగా బిసిలందరు కేవలం జెండా మోయడానికిమిగతా వాళ్ళని గద్దెపై కూర్చోబెట్టడానికే బిసిలు ఉన్నారా. షర్ట్ మార్చినంత ఈజీగా ఎమ్మెల్యేలు పార్టీలు మారిపార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఏ పార్టీ ఎదుగుదల ఉంటే అపార్టీలోకి వెళ్తారు 30 ఏండ్లుగా ఒక్కడే ఎమ్మెల్యే గా ఉంటాడు బిసి ల భవిష్యత్తు లో మార్పు లేదు. 50 ఏండ్లుగా వింటున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బ్రతుకులు మారుతాయి అన్నారు మారాలే టిడిపి వస్తే బ్రతుకులు మారుతాయి అన్నారు వాళ్ళు వచ్చారు బ్రతుకులు మారలేదు తరువాత మళ్ళీ కాంగ్రెస్ వస్తే బ్రతుకులు మారుతాయి అన్నారు మారలేదు తరువాత టీఆరెస్ వస్తే బ్రతుకులు మారుతాయి అన్నారు మారలేదు ఇప్పుడు ఇంకో వాదన ఇంకెన్నేళ్ళు చూసిన బిసిల బ్రతుకులు మారవు అని తీవ్రంగా ఆవేదన చెందారు. మునుగుడులో బిసి ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి సుమారు 30000 వేల ఓట్లు చీల్చి తెలంగాణ లో మా బిసిల సత్తా చూపిస్తామని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పైనన్స్ కమిటీ వైస్ చెర్మాన్ బత్తుల రాములు, రాష్ట్ర కార్యదర్శి రామిని సందీప్, యాదగిరి ముదిరాజ్, వెంకటేష్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్లు కృష్టంగారి ప్రకాష్, పుప్పాల ప్రభాకర్, గండ్ల వెంకటేశ్వర్లు, బాలు యాదవ్ కంటోన్మెంట్ ఇంచార్జ్ ఆకుల శశికాంత్ బిసి బంధావులు పాల్గొన్నారు.

Post A Comment: