ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ


హన్మకొండ ;

జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల కార్యాచరణ లో భాగంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ-వరంగల్ కార్యదర్శి-సీనియర్ సివిల్ జడ్జి జాబిషెట్టి ఉపేందర్ రావు పలివేల్పుల (భీమారం) లోని లార్డు అనాధ వృద్ధాశ్రమం లో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం  జరిగింది.

ఈ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి వృద్ధుల వ్యక్తిగత, ఆరోగ్య, న్యాయపరమైన సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల సంక్షేమం కొరకు న్యాయ సేవ అధికార సంస్థలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిర్వాహకులు నరేష్ కు సూచించారు.  వృధ్దుల సౌకర్యార్థం ఆశ్రమంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించబోతు న్నట్లు  వృద్ధులకు హామీ ఇచ్చారు. ఎటువంటి సహాయానికైననూ న్యాయసేవాధికార సంస్థలను సంప్రదించి, ఉచిత సలహాలు సూచనలను పొందవచ్చు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ డాక్టర్ కె.అనితా రెడ్డి, లార్డ్ వృద్దాశ్రమం నిర్వాహకులు, ఆశ్రమం లోని వృద్ధులు పాల్గొన్నారు. అనంతరం సమీపంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల (బాలికల) ను సందర్శించి,  విద్యార్థినులకు న్యాయ సేవ అధికార సంస్థల విధి విధానాలను విద్యార్థులకు అర్థమయ్యేలా విపులంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పాఠశాలలోని వంట గది‍‍, సామాను భధ్రపరుచు గదులను పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం సరైన పోషకాలు గల ఆహారాన్ని అందిస్తున్నారా అని విద్యార్థినులను, పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: