చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ 36వ బూత్ పరిధిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాలని, కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణ ఫలాలు కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తుందని, యావత్ తెలంగాణ కెసిఆర్ కుటుంబం చేతుల్లో మోసపోయిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఓటు వేసి, టిఆర్ఎస్ పార్టీనీ చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ ఫోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు నాయకులు మర్రి మహేందర్ రెడ్డి, వెంకటాచారి, పందుల స్వామి, చింతకింది హరీష్, కర్నాటి మోహన్ రాపర్తి వెంకటేశా, పోలోజు వినయ్, పోలోజు నరసింహ చారి, కొలను రాము తదితరులు పాల్గొన్నారు..


Post A Comment: