పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న



పాలకుర్తి:పెద్దపల్లి జిల్లా:అక్టోబర్:20:22:విద్యార్థుల పరిజ్ఞానం పెంచేందుకు కృత్యాధార బోధనకు పెద్దపీట,విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు,పాలకుర్తి మండలంలో పర్యటించి 2 అంగన్వాడి కేంద్రాలను,జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన సంచార విజ్ఞాన గణిత ప్రయోగశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు.గురువారం పాలకుర్తి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ మండల కేంద్రం,ఈసాల తక్కలపల్లిలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంచార ప్రయోగశాల ద్వారా విద్యార్థులకు అందిస్తున్న కృత్యాధార బోధన విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.పెద్దపల్లిజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,విద్యార్థలలో శాస్త్రీయ అభిరుచిని పెంపొందించి,సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీసే దిశగా జిల్లాలో సంచార ప్రయోగశాలను ఏర్పాటు చేసి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కృత్యాధార బోధన అందిస్తున్నామని తెలిపారు.కోవిడ్ 19 వల్ల పాఠశాలలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల గత ఏడాది నవంబర్ లో ప్రారంభించిన కార్యక్రమం మంచి ఫలితాలు అందించడంతో ప్రస్తుత సంవత్సరం కొనసాగిస్తున్నామని తెలిపారు.కృత్యాధార బోధనకు పెద్దపీట వేసి విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ పాఠ్యాంశాలను నేర్పుతున్న ఉపాధ్యాయులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి గ్రామం,పాలకుర్తి హెడ్ క్వార్టర్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్,సిబ్బంది అందుబాటులో లేకపోవడం,అంగన్వాడి కేంద్రంలో పిల్లలు లేకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,అంగన్వాడీ కేంద్ర టీచర్లు,సహాయకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంభందిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బి.రవినందన్ రావు,పాలకుర్తి తహసిల్దార్,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: