పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న


                       
గోదావరిఖని:అక్టోబర్:20:22:రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని-1టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఎ.గోపాల్-1595,గుండెపోటుతో మరణించగా ఆయన భార్య రాధమ్మ,కుమారుడు ప్రశాంత్ లకు భద్రత ఎక్స్గ్రేషియా 7,99,160 (ఏడు లక్షల తొంబైతొమ్మిది వేల నూట అరవై రూపాయల)చెక్ ను గురువారం సీపీ  కార్యాలయంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు,వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు.పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్,అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ.ఓ నాగమణి గారు,ఇంద్రసేన రెడ్డి,నాగేశ్వర్ రావు సూపరింటెండెంట్స్,సీసీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: