ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు, తమ అమూల్యమైన ప్రాణాలను, త్యాగం చేయడం జరిగిందని, వారి త్యాగం వలనే ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొన్నదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె.సురేందర్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడంలో భాగంగా ఈ నెల 21 నుండి 31 వరకు భూపాలపల్లి జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో పోలీసు ప్లాగ్ డే కార్యక్రమాల నిర్వహణ లో భాగంగా..1) విద్యార్థులకు పోలీస్ స్టేషన్ యందు ఓపెన్ హౌజ్ కార్యక్రమం .
2) స్కూల్ పిల్లలకు మరియు పోలీస్ సిబ్బంది పిల్లలకు వ్యాస రచన పోటీలు, రంగులు పోటీలు, పెయింటింగ్ కార్యక్రమాలు.
3) పోలీస్ సిబ్బందికి వ్యాస రచన పోటీలు.
4)దివంగత పోలీసు కుటుంబాలతో సమావేశం,
5) రక్తదాన శిబిరాలు ఏర్పాటు,
6) రేపు జిల్లా అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో స్మృతి పరేడ్ నిర్వహణ,
7) అక్టోబర్ 31న జాతీయ ఐక్యతదినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఎస్పి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమాలను తప్పకుండా నిర్వహించాలని ఎస్పి జె.సురేందర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

Post A Comment: