మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి నాయకుడు కౌశిక హరి తలపెట్టిన ఎమ్మార్వో కలెక్టర్ గార్ల చేత అర్హులైన నిరుపేద దళితులకు దళిత బంధు పథకం ప్రక్రియ నిర్వహించాలని రామగుండం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి సీనియర్ నాయకుడు కౌశిక హరి మాట్లాడుతూ దళిత బంధు కేవలం టిఆర్ఎస్ బందుగా మారిపోయిందని ఇది ఎమ్మెల్యే ఇష్టం ఉన్నవారికి ఇచ్చుకోవడానికి ఇదేమి కెసిఆర్ సొంత ఖజానా కాదు అని రాష్ట్రంలో ప్రజల యొక్క సంపాదనని కాబట్టి దీనికి దళితులు అందరూ అర్హులని కేవలం ప్రజాప్రతినిధుల బంధువులకు మాత్రమే టిఆర్ఎస్ తొత్తులకు మాత్రమే ఈ యొక్క దళిత బంధు వర్తించడం సబబు కాదని ఆయన అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ అధికారులచే నిర్ణయించబడాలని అసలైన అర్హులను గుర్తించి దళిత బంధు ప్రకటించాలని అవసరమైతే ఆ తర్వాత కార్లు బంగాళాలు ఉన్న ధనికులకు కూడా ఇచ్చుకొని అని ఆయన ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి మల్లికార్జున్ మహిళా నాయకురాలు 22 డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత రామగుండం అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్ రామగుండం నియోజకవర్గ అధికార ప్రతినిధి సుల్వ లక్ష్మీ నరసయ్య బిజెపి సీనియర్ నాయకులు మహవాది రామన్న ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు కొండపర్తి సంజీవ్ నరహరి పున్నం శశి కుమార్ నిమ్మరాజుల రవి గోపగాని నవీన్ గౌడ్ మేకల శ్రీనివాస్ బిబ్బెర తిరుపతి దారంగుల కుమార్ శివరామకృష్ణ షాడవేణి రాజు గడపురం కళ్యాణ్, గాలేంకి ప్రసాద్, ఉప్పుసాయి బోనగిరి కుమార్ పులి శ్రీనివాస్ వంశీ జరుపుల శ్రీనివాస్ శెట్టి రాజశేఖర్ పెద్ద ఎత్తున బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: