చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామం లో గల ప్రతిష్ట కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వేతన ఒప్పందం చేయాలని కోరుతూ ప్రతిష్ట
స్టాఫ్,వర్కర్స్ యూనియన్ సిఐటియు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరుకుంది. మోకాళ్లపై నిలబడినిరసన తెలియజేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్న రెండు సంవత్సరాల బోనస్ పెండింగ్
వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రతిష్ట కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, సంవత్సర కాలంగా పెండింగ్ లో పెట్టిన వేతన ఒప్పందం వెంటనే చేయాలని నినాదాలు చేస్తూ మోకాళ్లపై నిలబడి సమ్మె కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, ప్రతిష్ట యూనియన్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం దూసరి వెంకటేశం సత్యనారాయణ, బిక్షపతి, బుచ్చమ్మ లలిత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: