ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ET
వరంగల్ 27వ డివిజన్ పాత గ్రైన్ మార్కెట్ లో గల ప్రభుత్వ ఆయుర్వేద బోధన వైద్య కళాశాలలో మహిళలు,పురుషుల సౌకర్యార్థం వేరు వేరు గా ఏర్పాటు చేసిన 80 పడకల విభాగాలను,ఆర్.ఓ.ప్లాంట్ ను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి పసునూరి దయాకర్,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండుసుధారాణి,కలెక్టర్ గోపి, చైర్మన్ డా.హరిరమాదేవి, కార్పోరేటర్ చింతాకుల అనీల్, ముఖ్య నాయకులు ఉన్నారు. అనంతరం వారు చికిత్స పొందుతున్న వారితో కాసేపు మాట్లాడారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్బుత ప్రగతి సాధిస్తుందన్నారు. వరంగల్ జిల్లా ను ప్రగతి పథంలో నడిపించడం కోసం కావలసిన అన్ని సదుపాయాలపై స్థానిక జిల్లా పాలనాధికారి వారితో వివిధ సమావేశాల ద్వారా సంప్రదించుకుని స్థానిక కార్పొరేటర్లు. జిల్లా అధికారులను ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నామన్నారు. గురువారం వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ కు వసతులను ప్రారంభించనున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వైద్య రంగంలో పెనుమార్పును చూస్తున్నామన్నారు.వరంగల్ మెడికల్ హబ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1100 కోట్లతో సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం,బస్తీ దవాఖాల ఏర్పాటు పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులను కల్పిస్తున్నారన్నారు.
Post A Comment: