మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని:- గంగానగర్ ఫ్లైఓవర్ వద్ద బొగ్గు లారీల యజమానులు, డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు,ఈ కార్యక్రమం లో *రామగుండం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
లారీ అసోసియేషన్ గత 40 సంవత్సరాల నుండి అడ్రియాలా మైన్స్ లో బొగ్గు లోడింగ్ చేస్తున్న వారి జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు,అడ్రియాలా మైన్స్ మాది అని మంథని లారీ అసోసియేషన్ లారీలకు లోడింగ్ అనుమతి ఇచ్చి *జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అక్రమంగా బొగ్గును *తరలిస్తునందున, రామగుండం లారీ అసోసియేషన్ ఓనర్ లు, డ్రైవర్, క్లీనర్లు,వారం రోజుల నుండి ధర్నా చేస్తున్నారని... DCP అధికారులతో మాట్లాడి అక్కడి లోడింగ్ ని ఆపేసి, రామగుండం లారీ అసోసియేషన్ కి అనుమతి ఇవ్వాలి కోరగా..చర్చల అనంతరం Dcp అధికారులతో మాట్లాడి మంథని లారీల ను ఆపేసి, రామగుండం లారీ లను అనుమతించారు ...
కాగా తమ అసోసియేషన్ కష్టలు తెలుసుకొని తమకు మద్దతు తెలియచేస్తు విజయకేతనం ఎగరవేసిన *రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కు లారీ అసోసియేషన్ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి సన్మానం చేశారు,,
Post A Comment: