మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ రాష్ట్రం లోని ఆడబిడ్దలకు పెద్దన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని..
తెలంగాణ ఆడబిడ్దలకు బతుకమ్మ పండుగకు సిఎం కేసీఆర్ బతుకమ్మ చీరను కానుకగా అందిస్తున్నరని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి రైతు వేదికలు మండల లోని మహిళలకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ముందుగా ఎంపీపీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ర్ట ప్రజలదని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆడపచులకు బతుకమ్మ పండగ సందర్భంగా సిఎం గారు చీరాలు పంపిణీ చెస్తున్నరని అన్నారు. ఈ నెల 30 తేదీన గోదావరిఖని పట్టణంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కన్నుల పండగగా కోలాట బతుకమ్మ 2020 సంబురాలను నిర్వహించనున్నామని తెలిపారు.
ఈ కోలాటం బతుకమ్మ సంబురాల్లో ఉత్తమ కోలాట బృందానికి మెదటి బహుమతిగా 44 వేలు 2 వ బహుమతిగా 21 వేలు మూడవ బహుమతిగా 11 వేల అందించడఁ జరుగుతుందని, కోలాట బతుకమ్మ సంబురాల్లో పాల్గొనే కోలాట బృందాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 1 రూపాయు చెల్లించి తమ గ్రూప్ లను నమోదు చేసుకోవాలన్నారు. రామగుండం నియోజకవర్గం లోని ఆడబిడ్దలంతా ఈ సంబురాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లోజడ్పీటీసి ఆముల నారాయణ ఎంపీపీ దుర్గం విజయ తహశీల్దార్ వేణుగోపాల్ ఎంపిడిఓ యాదగిరి మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: