మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండల్ రాయదండి గ్రామంలో సర్పంచ్ ధర్మాజీ కృష్ణ ఆధ్వర్యంలో అంతర్గాం జెడ్పిటిసి ఆముల నారాయణ చేతుల మీదుగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పిటిసి ఆముల నారాయణ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయంగా బతుకమ్మ పండుగకు ప్రపంచంలోనే గుర్తింపు ఉందని తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శమని మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఇలాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా లేవన్నారు బతుకమ్మ పండుగకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిర్వహించడం జరుగుతుందని ఆడపడుచులకు బతుకమ్మ చీర అందించడం పుట్టింటి కట్నం లాంటిదని అన్నారు ఆడపడుచులు బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా జరుపుకోవాలని కోరారు అనంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మాజీ కృష్ణ ఉపసర్పంచ్ తాని పవన్ కుమార్ వార్డు సభ్యులు ధర్మాజీ చంద్రశేఖర్ కొయిలాల శంకర్ గుమ్ముల సదయ్య ప్రసాద్ మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: