మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మార్కండేయ కాలనీలోని లక్ష్మీప్రసన్న గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ Sc సెల్ అధ్యక్షులు తాళ్లపల్లి యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ 50 డివిజన్ల అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గం లోని ప్రతి దళితునికి దళిత బంధు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే దళిత బంధు ఇస్తూ పేద దళిత ప్రజలకు ఇవ్వకుండా కమిషన్ ల మీద నడిపిస్తూ టిఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఇస్తున్నాడని స్థానిక ఎమ్మెల్యే మోసం చేస్తున్నాడని దళిత బంధు కాదు దగ్గరి బంధు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో Sc, st సబ్ ప్లాన్ టు పెట్టి దేశంలో అనేక సంస్కరణలు పెట్టి SC అభివృద్ధికి పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాజ్ ఠాకూర్ అన్నారు,రానున్న ఎన్నికల్లో దళితులందరూ బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు,, ఈ కార్యక్రమంలో కాల్వ లింగస్వామి,మాదారబోయిన రవికుమార్,గట్ల రమేష్,బిసి సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్,యూత్ కాంగ్రెస్ నజీముద్దీన్, హరి ప్రసాద్, దాసరి విజయ్,పజల్,రంజిత్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: