మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులుస్వర్గీయ "డాక్టర్.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి" కార్యక్రమం నిర్వహించారు*ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ , రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరై దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు,
అనంతరం: మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ఫీజు రీయంబర్స్మెంట్ 108 అంబులెన్స్ ఆరోగ్యశ్రీ ఎంతో మంది పేదలందరికీ పట్టాలు ఇప్పించిన ఘనత మన రాజశేఖర్ రెడ్డి ది పేద బడుగు బలహీన వర్గాలకు వెన్నంటు ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పోరేటర్లు, ఎస్సి, బీసీ మైనారిటీ, మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్, & NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: