ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
హన్మకొండ ;
గణపతి నవరాత్రుల సందర్బంగా కాశిబుగ్గ వర్తకసంఘం వారి ఆద్వర్యంలో శ్రీ భద్రకాళి పరపతి సంఘం వారి ఆద్వర్యంలో1116 కిలోల లడ్డును 5 వ తేది సోమవారం రోజున అందించనున్నారు. ఆ లడ్డూ ప్రసాదం తయారీ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూ తయారీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. వర్తకసంఘం వారు ఏర్పాటు చేసిన గణనాదుని వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, ఓని స్వర్ణలత భాస్కర్, మాజీ కార్పోరేటర్ బయ్య స్వామి, వర్తకసంఘం అద్యక్షుడు గుండేటి కృష్ణమూర్తి, సముద్రాల పరమేశ్వర్,లడ్డు తయారీ చేసి గణనాదునికి సమర్పిస్తున్న బాంబుల కుమార్, గోరంటాల మనోహర్,వేముల నాగరాజు, మాటేటి విద్యాసాగర్,ఓం ప్రకాష్ కొలారియా, మండల శ్రీరాములు, వడిచెర్ల సదానందం, వర్తకసంఘం కార్యవర్గ సభ్యులు,శ్రీ భద్రకాళి పరపతి సంఘం కార్యవర్గ సభ్యులు,లక్ష్మి గణపతి పరపతిసంఘం కార్యవర్గ సభ్యులు,కాశిబుగ్గ మిత్రమండలి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: