మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రజ సేవకే తన జీవితాన్ని అకింతం చేసే జననేత ఆయన... అన్నా కష్టముందంటే వెన్నంటి నిలిచే తత్వం ఆయనది... ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషితో ఎన్టీపీసి కాంట్రాక్టు కార్మికులతో ఎన్టీపీసీ యాజమాన్యం 2018లో చేసుకున్న పూర్తిస్థాయి ఒప్పందాల అమలుకు మార్గం సుగమం అయ్యింది.
కాంట్రాక్టు కార్మికులను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలమైన అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులతో 2018లో చేసుకున్న ఒప్పందాలు అమలు చేయాలని కోరుతూ నిరసన తెలిపిన క్రమంలో వారిపై C.I.SF జవాన్లు దాడిచేశారని దీనిపై తాము తీవ్రంగా స్పందించామన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జేఎసీనాయకులందరని కలుపుకుని పోరాటం చేయడం జరిగిందన్నారు. పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
ఎన్టీపీసీ యాజమాన్యంతో జరిగిన చర్చల్లో కొంత పురోగతి సాధించినప్పటికి పూర్తి స్దాయిలో సఫలం కాలేదన్నారు.ఈ క్రమంలో తాము, పెద్దపల్లి *ఎంపీ వెంకటేష్ నేత*జే.ఎ.సీ నాయకులతో కలిసి ఎన్టీపీసీ యాజమాన్యంతో 2018లో చేసుకున్న ఒప్పందాలు పూర్తి స్థాయిలో అమలయ్యేాలా కృషి చేసామన్నారు.
కార్మికులకు ఏ కష్టం వచ్చైనా, వారికి ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు.
కాగా ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు మూడు రోజుల పాటు విధులు బహిష్కరించి, గేటు ఎదుటే ధర్నా చేపట్టగా, ఎమ్మెల్యే చందర్ తన స్వంత ఖర్చులతో రెండు రోజుల పాటు మధ్యాహ్నం భోజనాలు వండించి, కార్మికులకు స్వయంగా వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు.

Post A Comment: