మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ ఉరి మెట్ల రాజలింగం స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ అంతర్గాం మండలం పెద్దంపేట మరియు రాయదండి గ్రామాలకు సంబంధించిన కూర్సు కమ్మి భూములకు పట్టాలిలు ఇస్తామని ఇది కోరుకంటి చంద్రన్న పుట్టినరోజు గిఫ్ట్ అని పోయిన సంవత్సరం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పుట్టినరోజు కానుక అని గ్రామ నడిబొడ్డున అధికార పార్టీ నాయకులు సంబరాలు జరుపుకొని సంవత్సరం గడిచిన ఇప్పటివరకు అతిగతి లేదని కనీసం పేపర్ కూడా కదలలేదని పట్టాల అవడం సంగతి పక్కన పెడితే సాక్షాత్తు ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కూర్సు కమ్మి భూములకు పట్టాలి ఇవ్వడం కష్టమేనని చెప్పిన విషయం లో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మీ పుట్టినరోజు కానుక అని చెప్పి సంవత్సరం గడిచిన ఇప్పటివరకు నెరవేరకపోవడం బాధాకరమని ఇప్పటికైనా ఈ విషయంలో దృష్టి సారించకపోతే చాతకాకపోతే బాహుటంగా మీరు చెప్తే కాంగ్రెస్ పార్టీ బుజాల మీద వేసుకొని రాజ్ ఠాకూర్ సహకారంతో శ్రీధర్ బాబు మరియు భట్టి విక్రమార్క నాయకత్వంలో శాసనసభలో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు*స్థాయిని మరిచి ముఖ్యమంత్రి లాగా ఫీల్ అవడం కాదు సంక్షేమంపై దృష్టి సారించాలని శాసనసభ్యునికి సూచించిన మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం*ఇదే కార్యక్రమంలో హాజరైన మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుడు స్థాయిని మరిచి ముఖ్యమంత్రి చేయాల్సిన పని కూడా నేనే చేస్తా అని ప్రగల్లు పలకడం కాదు నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి సారించాలని కల్లబలి మాటలతో కాలం వెళ్లదీయకూడదని హెచ్చరించారు*దళిత బంధు ప్రతి దళితుడికి ఇవ్వాలి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఈదునూరి హరి ప్రసాద్ డిమాండ్*ఈ కార్యక్రమంలో హాజరైన ఎస్ ఎల్ రాష్ట్ర కార్యదర్శి ఈదునూరి హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితునికి దళిత బంధం ఇవ్వాలని కేవలం మీ తెరాస కార్యకర్తలకే ఇవ్వాలనుకుంటే దొరల గడీలలో దాచిన డబ్బులు వెలికి తీసి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంబంధించిన ఆస్తులు పంచాలని ప్రజల సొమ్ము పంచితే రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు*ఎమ్మెల్యే ఇల్లు కేటీఆర్ గిఫ్ట్ కాదు ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగ బాధితుల రక్తంతో కట్టిందని తెలియజేసిన అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం*అంతర్గ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం మాట్లాడుతూ మా మండలంలోని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అమాయక నిరుద్యోగులను మాయమాటలతో పర్మనెంట్ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి వారి రక్తం చెమట చుక్కలుగా మార్చి సంపాదించిన డబ్బుతో కట్టిన ఇల్లు కేటీఆర్ గిఫ్ట్ అనేది చెప్పడం విడ్డూరంగా ఉందని వారి డబ్బులు వారికి చెల్లించేంతవరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని శాసనసభ్యునికి హెచ్చరించారు*ఈ పత్రికా సమావేశంలో అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఈదునూరి హరిప్రసాద్ ఉమ్మడి రామగుండం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజమల్లుయాదవ్ కాంగ్రెస్ పార్టీ అంతర్గాం మండల నాయకులు సింగం కిరణ్ కుమార్ గౌడ్ గజ్జల నాగరాజు సుందర వేణి శేఖర్ గొర్రె చందు అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు ఎండి గౌస్ ఊరేగి మహేష్ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: