చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో టీఆర్ఎస్ యువజన విభాగం సమావేశం గురువారం నిర్వహించారు. ఈసమావేశానికి టిఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు నా రెడ్డి అభినందన్ రెడ్డి పాల్గొని
మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణలోని కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అన్ని రంగాల్లో
ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మునుగోడు లో జరిగే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడాయువకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆరెగూడెం టిఆర్ఎస్ యువజన విభాగ
అధ్యక్షులుగా ఎన్నపల్లి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దుర్గం రాజులను ఎన్నుకున్నారు.
సమావేశంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మునగాల ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్ గ్రా శాఖ అధ్యక్షులు ఎన్నపల్లి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: