ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సర్వ మతాలకు ప్రతీక, సమైక్యతకు ప్రతిరూపం ఖాజీపేట దర్గా అని ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
శుక్రవారం నాడు కాజీపేట దర్గా, పీఠాధిపతి ఖుస్రూ పాషా, అధ్యక్షతన జరిగిన
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ మాట్లాడుతూ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కల్గిన దర్గా ఉర్సు, ఉత్సవాలు ఘనంగా మూడు రోజులు పాటు 24,25,26, చందనోత్సవము (సందల్) , ఉర్సు షరీఫ్, బదావా, కార్యక్రమలు జరుపుకుంటారని, తెలిపారు.
దేశంలో అనేక ప్రాంతాలు, ఇతర దేశాల నుండి భక్తులు వస్తారని అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా పూర్తి చేసామని తెలిపారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండేందుకు పోలీస్, వైద్య ఆరోగ్య, శానిటేషన్, త్రాగు నీరు,విద్యుత్, రవాణా, సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సౌకర్యాలు కల్పించామన్నారు.
స్థానిక స్కూల్ లకు సెలవు ప్రకటించి అందులో భక్తులకు వసతి కల్పించమన్నారు. భక్తులందరూ అధిక సంఖ్యలో దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలువాలని చీఫ్ విప్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్, అనీసు రషీద్,
పీఠాధిపతి ఖుస్రూ పాషా, వాక్బోర్డు అభివృద్ధి అధికారి, మన్సూర్ పాషా, కార్పొరేటర్ తాడిశేట్టి విద్య సాగర్, కుడా మాజీ చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి, సయ్యద్ గులాం అఫ్జల్ బియాబాని ఖుస్రూ పాషా,మసూద్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: