ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
23న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎస్పి జె. సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు రేగొండ ఎస్సై ఎన్ N.శ్రీకాంత్ రెడ్డి మరియు సిబ్బంది కలిసి రేగొండ గ్రామ శివారులోని టీఎస్ఎండిసి చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేయుచుండగా రేగొండ వైపు నుంచి ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై వస్తుండగా పోలీసు వారిని చూసి వెనక్కి తిరిగి తప్పించుకొని పారిపోవుటకు ప్రయత్నించగా వెంటనే ఎస్ఐ రేగొండ మరియు తన సిబ్బందితో కలిసి అతడిని పట్టుకొని విచారించగా నా పేరు నరిగె రాజయ్య (48) గాంధీనగర్ గ్రామం రేగొండ మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని తెలిపి, నా తమ్ముడు అయినటువంటి నరిగె ఓంకార్ అలియాస్ ప్రకాష్ పీపుల్స్ వారు గ్రూప్ పార్టీలో పని చేస్తూ అందాజా 20 సంవత్సరాల క్రితం కౌకొండ ఎన్కౌంటర్లో చనిపోయినాడని, అతని అంత్యక్రియల సమయంలో పీపుల్స్ వార్ గ్రూప్ పార్టీ సభ్యులు సానుభూతిపరులు హాజరై ఆ సందర్భంలో వారితో పరిచయం ఏర్పడి వారితో ఒకటి రెండు సార్లు మాట్లాడగా వారు పోలీసు వారి సమాచారం మరియు భూస్వాముల యొక్క వివరాలు వ్యాపారస్తుల యొక్క వివరాలు తెలుపమనగా ఆ వివరాలను చెప్పేవాడిని మరియు మా ప్రాంతముకు వచ్చినప్పుడల్లా దళానికి భోజనం వసతి కల్పించే వాడిని. ఈ విషయం లో 2000 సం లో నా పైన రేగొండ పోలీస్ స్టేషన్ లో కేసు అయినది మరియు అన్నలతో అదేవిధంగా సంబంధాలు కొనసాగుచుండగా మా మండలం జగ్గయ్యపేటకి చెందిన కొమ్ముల నరేష్ దళంలో ఉండి మా ఏరియాకు వచ్చినప్పుడు నాకు కలిసేవాడు. అతను వచ్చిన సమయంలో నాకు ఉన్న భూమి పంచాయతీల గూర్చి చెప్పగా పీపుల్స్ వారు మావోయిస్టు పార్టీ నాయకుడు అయిన దామోదరన్నను కలుద్దాం రమ్మని అనగా కొమ్ముల నరేశ్ తో కలిసి మొదటిసారి 2018 సంవత్సరం లో చత్తీస్గడ్ అడవులలో కలిసినాను. ఆ తర్వాత రెండు మూడు సార్లు ఏటూరునాగారం ఏరియాలోని అడవిలో కలిసినాను.
2019 సంవత్సరంలో మా మండలం లో ని జగ్గయపేట గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ దళ సబ్యుడు కొమ్ముల నరేష్ మరియు ఒక మహిళా సభ్యురాలు రాత్రి సమయంలో మా ఇంటికి వచ్చి ఒక తుపాకీ నాకు ఇచ్చి మేము మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళినారు. అయితే ఈ సంవత్సరం జనవరి నెల లో వాజేడు ఏరియా లో జరిగిన ఎన్ కౌంటర్ లో కొమ్ముల నరేశ్ చని పోయినందున నా వద్దకు రాకపోవడంతోటి నేను నా యొక్క భూ సమస్యల పరిష్కారం గురించి ఇట్టి తుపాకీతో బెదిరించి భూమి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుందామని తుపాకీని నాతోపాటు ఉంచుకున్నాను.
20న మావోయిస్టు పార్టీ నాయకుడు దామోదర్ అన్న పంపగా ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి రేగొండ మరియు పరకాలలో వ్యాపారస్తులను నీ వద్ద ఉన్న తుపాకి తో బెదిరించి పార్టీ ఫండ్ డబ్బులు వసూలు చేసి పంపాలని దామోదర్ అన్న చెప్పినాడు అని ఈనెల 21 నుండి 27 వరకు మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా అక్కడక్కడ వాల్ పేపర్స్ పాంప్లెట్స్ అంటించడం మరియు ప్రధాన కూడళ్ళ వద్ద వేయడం చేయాలని నాకు (50) వరకు మావోయిస్టు వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను నాకు ఇవ్వడం జరిగినది. పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తేదీ 23 న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నా వద్ద ఉన్నటువంటి తుపాకీని మరియు కరపత్రాలను తీసుకొని ఇంటి నుండి బయలుదేరి నా యొక్క మోటార్ సైకిల్ గ్లామర్ నంబర్ TS25E6125 గల వాహనంపై పరకాలకు వెళ్తుండగా రేగొండ శివారులోని టీఎస్ఎండిసి చెక్ పోస్ట్ వద్ద పోలీసు వారిని చూసి తప్పించుకోవాలని ఉద్దేశంతో మోటార్ సైకిల్ పై పారిపోతున్న క్రమంలో పోలీసు వారు నన్ను వెంబడించి పట్టుకున్నారని తెలిపినాడు .
స్వాధీనపరుచుకున్నవస్తువులు : కంట్రీమేడ్ పిస్టల్ -1,
7.65 ఎం ఎం రౌండ్స్
-2, మావోయిస్టు వారోత్సవాల కరపత్రాలు-50
లభ్యమైనట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, ఇన్స్పెక్టర్ లు వాసుదేవ రావు, పులి వెంకట్, రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: