ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలలో భాగంగా హనుమకొండ జిల్లా లోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు చేపట్టడం జరిగింది.
ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు నేతృత్వంలో కాకాజీ కాలనీ లో గల 4 ఆస్పత్రులను తనిఖీ చేయడం జరిగింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2010 ననుసరించి నియమ l నిబంధనలకు అనుగుణంగా ధరల పట్టిక, అనుమతి పత్రాలను, ప్రదర్శించ నందున వలన మూడు ఆసుపత్రులకు మరియు ఒక డెంటల్ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ లేనందువలన నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా కొత్తగా ఈ చట్టం ప్రకారం ఆయుర్వేద , హోమియో , యునాని, నేచరోపతి క్లినిక్ లు, ఆసుపత్రు లు మొదలగునవి విధిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ తనిఖీల యొక్క నివేదికను ప్రతిరోజు హెల్త్ డైరెక్టర్ కు నివేదిస్తామని ఆయన తెలిపారు.
ఇట్టి తనిఖీ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ మదన్మోహన్, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ యాకూబ్ పాషా, జిల్లా మాస్ మీడియా అధికారి వేముల అశోక్ రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, సి హెచ్ వో మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: