మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి కాంటాక్ట్ కార్మికులపై మరియు బిజెపి నాయకుడు కార్మిక నేత కౌశిక హరి పై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ అంతర్గాం మండలం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ సంఘటనను ఖండిస్తున్నాం. బిజెపి సీనియర్ నాయకులు గాలింనికి ప్రసాద్, నిమ్మరాజుల రవి మాట్లాడుతూ కార్మికులపై కార్మిక నాయకులపై ఎన్టిపిసి యాజమాన్యం మరియు సిఐఎస్ఎఫ్ దళాల దుందుడుకు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇప్పటివరకు ఎన్టిపిసి చరిత్రలో ఇలాంటి చర్యలు ఏనాడు జరగలేదని ఇది కార్మికుల ఐక్యత ను చెడగొట్టే కుట్ర అని కార్మికుల ఐక్యతను దెబ్బతీయడానికి చేసిన నిరంకుస ఆలోచన అని దీనికి పాల్పడ్డ సిఐఎస్ఎఫ్ పోలీసులపై ఎన్టిపిసి హెచ్ఆర్ విజయలక్ష్మి పై హత్యయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల శాఖ నిమ్మ రాజుల రవి ఆలకుంట పరశురాం మాదా శంకర్ గౌడ్ ఉప్పులేటి ప్రవీణ్ మగ్గిడి రాజు గోపు శంకర్ పులి శ్రీనివాస్ కన్నం మోహన్ తోటపల్లి శ్రీకాంత్ గాలంకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: