మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



రామగుండం 20 వ డివిజన్ భరత్ నగర్ లొ పేదమ్మాయి ధరవత్ సమ్మక్క వివాహానికి స్థానిక 20 వ డివిజన్ కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ రూ . 5000 / -ల ఆర్థిక సహాయంను అందచేశారు. ధరవత్ సమ్మక్కకు తండ్రి ధరవత్ వీరు గత రెండు సంవత్సరాల క్రితం మరణించాడు. తల్లి ధరవత్ అమ్మి మనస్థిమితం లేక ఎటొ వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ "మా తల్లిగారైన స్వర్గీయ కన్నూరి సౌందర్యమ్మ సమాజంలో మంచి చేయడానికి ఎంత చేయగలిగితే , అంత ఎన్ని సార్లు అవకాశం ఉంటే అన్ని సార్లు మంచి చేయాలని , మానవత్వం ను చాటాలని అన్నారని, అందుకని మా తల్లి స్మారకార్థం ఇలాంటి సహాయక కార్యక్రమాలు చేపడుతున్నామని" అన్నారు . ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు షహేదాభాను, కోశాధికారి బి.రజని లు సమ్మక్కకి చీర జాకెట్ గాజులు అందచేశారు. ఈ కార్యక్రమంలొ బి.బుగ్గరాములు గౌడ్, డివిజన్ టి.ఆర్.ఎస్ అధ్యక్షులు షెక్.బాబుమియా, టి.ఆర్.ఎస్ యూత్ అధ్యక్షులు దండుగుల.శ్రీను, కనుకుంట్ల.రాకేష్, కొమ్మరాజుల.శీను, కొమ్ము.చందు, గండా.రాజు , బి.రజిత  తదితరులు పాల్గొన్నారు .

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: