మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి లేబర్ గేట్ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై సిఐఎస్ఎఫ్ పోలీస్ వారు లాఠీచార్జి చేయడం అమానుషం అని 20వ డివిజన్ కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ సమయంలొ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతు" గత 2018 లొ జరిగిన కార్మిక ఒప్పందాలను అమలు చేయాలని , తమ హక్కుల కోసం గత కొంత కాలంగా శాంతియుతంగా కార్మికులు, కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తుంటె నిమ్మకు నిరెత్తకుండా ఎన్టిపిసి యాజమాన్యం వ్యవహరిస్తున్నారు. ఈ రోజు విచాక్షణ రహితంగా కార్మికులపై లాఠీఛార్జీ చేయడం అత్యంత దారుణమని, ఈ చర్యకు పాల్పడిన సిఐఎస్ఎఫ్ పోలీసులను సస్పండ్ చేయాలని, ముఖ్యంగా ఈ చర్యలను ప్రోత్సహించిన ఎన్టిపిసి హెచ్ ఆర్ అధికారులను వెంటనే తొలగించాలని, ఎన్టిపిసి ఎన్ని జిమ్మిక్కులు చేసిన రాజకీయాలకు అతీతంగా మేమంతా ఒక్కటె, మా కార్మికులమంతా ఎకమై ఉంటాం, మరింత ఉద్యమం తీవ్రతరం చేస్తాం, మా హక్కుల సాధిస్తాం, మీ మెడలు వంచుతాం, స్థానిక రామగుండం పౌరుడిగా, ప్రజాప్రతినిధిగా ఈ కార్మిక పోరాటానికి మద్దతుగా ఉంటాం, పోరాటం చేస్తామని, హక్కులు సాదించే వరకు తగ్గెదిలేదని, ఎన్టిపిసి హెచ్ఆర్ అధికారుల్లారా ఖబర్దార్, కార్మికుల జోలికి వస్తే ఖతమైపోతారని జాగ్రత్తని, కార్మికుల పై లాఠీచార్జి కి నిరసనగా మూడు రోజులు నల్లబ్యాడ్జి తొ నిరసన తెలుపుతానని" అన్నారు.

Post A Comment: