మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరుగుతున్న ఆందోళనపై CISF సిబ్బంది అమానుషంగా లాఠీ చార్జీ జరిపి తలలు పగల గొట్టి కాళ్లు చేతులు విరగ గొట్టిన పాశవిక దాడిని ఖండిస్తూ కార్మికులకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ కార్పోరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేశ్ ఆధ్వర్యంలో మేడిపల్లి సెంటర్లో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఎన్టీపీసీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ బీహారీ పాలసీని అమలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ వాదులపై తెలంగాణ కార్మికులపై సిఐఎస్ఎఫ్ బలగాలచే దాడి చేయించి పాశవిక ఆనందం పొందుతుందని అన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందాని తెలిపారు. రాజీవ్ రహదారిపై వాహనాలు నిలిచి పోవడంతో రాజ్ ఠాకూర్ తో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు. ఈ రాస్తారోకోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పోరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Post A Comment: