మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: కాళేశ్వరంలో మృతుల కుటుంబాలకు,వరద ముంపుకు గురైన చిరు వ్యాపారులకు,ఈరోజు బిజెపి రాష్ట్ర నాయకులు,మంథని నియోజకవర్గం ఇన్చార్జ్ చందుపట్ల సునీల్ రెడ్డి ఆదేశానుసారం,స్థానిక బిజెపి నాయకుల ఆధ్వర్యంలో, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గగ్గురి బాపు, బెల్లంపల్లి శ్రీనివాస్ వారి కుటుంబాలకు 25 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులను అందజేశారు. అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి ముంపుకు నష్టపోయిన నదీతీర ప్రాంత చిరు వ్యాపారస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు
గోర దేవయ్య,మండల ప్రధాన కార్యదర్శి బొల్లం కిషన్,బీజేవైఎం జిల్లా కార్యదర్శి గోర శ్రీకాంత్, యూత్ అధ్యక్షుడు రేవెల్లి రాకేష్,ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లేతకరి చరణ్ దాస్,సతీష్,జావిద్,జక్కులు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: