మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలి, ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ తొ గోదావరిఖనిలొ న్యాయవాదులు చెపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపిన 20వ డివిజన్ కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతు " న్యాయంను రక్షించె న్యాయవాదులు తమకు రక్షణ కావాలి ఇలా దీక్షలు చేయడం ఒకింత బాధగా ఉందని, ఇది సమాజానికి మంచిది కాదని, నేడు సమాజంలొ మనషి తన సహజమైన మానవత్వ విలువలు కోల్పొతున్నాడని, మనిషికి సహనం లేకుండా పోతుందని, తనకు కావాలసింది సాధన ద్వార కాకుండా ఆక్రమించడం ద్వార, ఆసాంఘికంగా వ్యవహరించడం ద్వార ఎదగాలని అనుకోవడం వల్ల అనేకమైన భౌతిక దాడులు, చివరాకరికి హత్యలు చేయడం దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని. అలాంటి దుర్మార్గమైన సంఘటనలు న్యాయవాదుల పట్ల జరుగడం అత్యంత విచారకరమని, న్యాయవాదుల రిలేదీక్షలకు సంపూర్ణ మద్దతు తెలుపుతు, న్యాయవాదుల రక్షణ చట్టం అమలు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని,తెలంగాణ పోరాటం లొ న్యాయవాదుల పాత్ర మరువలేనిదని, తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు న్యాయవాదులంటె అమితమైన అభిమానమని, తప్పక వీలైనంత త్వరగా వారు పరిశీలించి తగి నిర్ణయం తీసుకుంటారని"అన్నారు
Post A Comment: