మొగుళ్లపల్లి, అక్టోబర్ 26 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయ రాజ్యాధికారం సాధించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. మొగుళ్లపల్లి మండలంలో టీఆర్‌పీ పార్టీ జెండా గద్దెను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలోని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేసి, బహుజన వర్గాలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. బహుజన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆధిపత్య రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తామని రవి పటేల్ పేర్కొన్నారు. మొగుళ్లపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో జెండా గద్దెలను ఏర్పాటు చేసి, గ్రామ కమిటీలను బలోపేతం చేస్తామని చెప్పారు. టీఆర్‌పీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బీసీ రాజ్యాధికార సాధనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార పాదయాత్ర భూపాలపల్లి జిల్లాకు చేరుకునేలోపు ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి, జెండా గద్దెల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. పాదయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు, జిల్లావ్యాప్తంగా బహుజనులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పాల్గొనేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గండు కరుణాకర్, పింగిడి శంకరయ్య, జినుకల శ్రీను, మామిడి శ్రీకాంత్, సామల చంద్రశేఖర్, మడే సంతోష్, వైద్య లక్ష్మణ్, మొగుళ్లపల్లి మండల నాయకులు గుణికంటి విష్ణు, ఇటుకల ప్రకాష్, రాజేందర్, లక్ష్మణ్, ఇటుకల రాధిక, రవికుమార్‌తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: