మహాముత్తారం అక్టోబర్‌ 24 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని మాదారం గ్రామంలో శనివారం కాటారం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈ. భీమేష్‌, మహాముత్తారం ఎస్‌ఐ రమేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు, టీజీఎస్‌పీ సిబ్బంది సంయుక్తంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో తనిఖీలు చేపట్టి ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాటారం సీఐ ఈ. భీమేష్‌ మాట్లాడుతూ గ్రామాల్లోకి అనుమానాస్పద వ్యక్తులు వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. గుడుంబా తయారీ, విక్రయాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారితో పాటు వన్యప్రాణులను వేటాడే వ్యక్తుల వివరాలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని సూచించారు. అలాగే సైబర్‌ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సైబర్‌ మోసాలకు గురైనట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని సీఐ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: