జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అక్టోబర్ 19 ( మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులు సోమవారం కాటారం మండల పరిధిలోని ప్రతాపగిరి గుట్టను సందర్శించారు. జిల్లా అటవీ అధికారి జి. కిష్టాగౌడ్, మహదేవపూర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఎం. సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటారం అటవీ క్షేత్రాధికారి జె. స్వాతి, కాటారం సెక్షన్ డీఆర్వో హెచ్. సురేందర్‌తో పాటు బీట్ ఆఫీసర్లు మొయినుద్దీన్, మోనకౌసర్, సంజీవ్, సాయికృష్ణ, ప్రతిబాబు, రాజేందర్, హరీష్, దామరకుంట బీట్ ఆఫీసర్ డి. అంజయ్య, బేస్ క్యాంప్ సిబ్బంది, డ్రైవర్ మహమూద్ పాల్గొన్నారు. ప్రతాపగిరి గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామ సిబ్బంది కూడా అధికారుల వెంట ఉన్నారు. జిల్లా, డివిజన్ స్థాయి అటవీ అధికారులు ప్రతాపగిరి గుట్టను సందర్శించడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 
అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో ఈ పర్యటన కొనసాగింది. అటవీ ప్రాంతాల పరిరక్షణ, క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనలో అధికారుల పర్యటనలు కీలకంగా నిలుస్తాయి. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, బీట్ స్థాయి సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: