పెద్దపల్లి జిల్లా, రామగిరి, అక్టోబర్ 20 (మేడిగడ్డ టీవీ న్యూస్): దసరా పండుగ, శ్రీదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంగళవారం రామగిరి మండలంలోని పలు గ్రామాల్లో కొలువుదీరిన దుర్గామాత అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగిరెడ్డిపల్లె, సుందిళ్ల, పన్నూరు, వకీల్‌పల్లె గ్రామాలతో పాటు సెంటినరీ కాలనీలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను సందర్శించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై దుర్గామాత కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆయా గ్రామాలకు చేరుకున్న సందర్భంగా దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు ఘనస్వాగతం పలికారు. ముస్త్యాల కమాన్ బోర్డు వద్ద గ్రామ ఉపసర్పంచ్ బాసినేని వినోద్, సత్యనారాయణరావు బృందం ఆయనను శాలువాతో సత్కరించి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. సుందిళ్ల నరసింహులపల్లిలో బోగిరి భాస్కర్, రాములు మిత్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీదుర్గామాత అమ్మవారిని పుట్ట మధుకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను సందర్శించి భక్తులతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమాల్లో సుందిళ్ల రాజు, బొడ్డుపల్లి రవి, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, అరవింద్, రోహిత్, మల్లేష్, గణేష్, వెంకట్, సుమన్, బానేష్, బచ్చు లక్ష్మి, శంకరయ్య, మమత, సాయికుమార్, రిషికేష్, సింగిరెడ్డిపల్లె దుర్గామాత కమిటీ సభ్యులు, మద్దూరి సాగర్, సుందిళ్ల ఆలయ మాజీ డైరెక్టర్ జుంగం ఎల్లగౌడ్, మాజీ సర్పంచ్ హరీష్, సతీష్, నరసయ్య, దోనేటి తిరుపతి, జూల రాజారాం తదితరులు పాల్గొన్నారు. అలాగే రామగిరి ప్రాంతానికి చెందిన కాపుర బోయిన భాస్కర్, శ్రావణ్, ప్రశాంత్, అనిల్, శంకర్, సుమన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: