కాటారం, అక్టోబర్ 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదరావుపేట గ్రామపంచాయతీలో మహిళా సమాఖ్య (VO) నూతన భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. వీబీ-జీ రామ్ జీ (VB-G RAM G) / ఉపాధి హామీ (NREGS) నిధులతో మంజూరైన భవన నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ బండి సువర్ణ-రమేష్, ఉప సర్పంచ్ కోట అశోక్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి నూతన VO భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి మహిళా సంఘాలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పీఆర్ ఏఈ సతీష్, ఐకేపీ ఏపీఎం, ఐకేపీ సీసీ లక్ష్మి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్, గ్రామపంచాయతీ కార్యదర్శి శివకుమార్ పాల్గొన్నారు. అలాగే VO అధ్యక్షురాలు అనపర్తి సరిత, పోతేం వనిత, సీఏలు కటుక సత్యవతి, దుర్గం స్వప్న, కోశాధికారులు గుంటి రజిత, కోట విజయ, 2వ వార్డు సభ్యుడు విలాసాగరం రవి, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: